విచారణకు ఆశిష్ మిశ్రా.. దీక్ష విరమించిన సిద్దూ

ఉత్తరప్రదేశ్​ లఖీంపూర్​ ఖేరీ లో నిరసన తెలుపుతున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు బలంగా వినిపించిన విషయం తెలిసిందే. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్​ చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్దూ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం అశిష్ […]

Advertisement
Update: 2021-10-09 06:29 GMT

ఉత్తరప్రదేశ్​ లఖీంపూర్​ ఖేరీ లో నిరసన తెలుపుతున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు బలంగా వినిపించిన విషయం తెలిసిందే. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్​ చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్దూ నిరాహార దీక్ష చేపట్టారు.

శనివారం ఉదయం అశిష్ మిశ్రా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో సిద్దూ దీక్షను విరమించారు. లఖీంపూర్ ఖేరీ ఘటనలో మరణించిన జర్నలిస్ట్‌ రామన్‌ కశ్యప్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం నిందితులను అరెస్టు చేసేంత వరకు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

కొనసాగుతున్న ఆందోళనలు..
లఖీంపూర్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. పలు రాష్ట్రాల్లో విపక్ష నేతలు నిరసనలు చేపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. శుక్రవారం పంజాబ్​ కాంగ్రెస్​ నేతలు చలో లఖీంపూర్​ భేరీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సిద్దూ నేతృత్వంలో కార్యకర్తలు లఖీంపూర్​ కు బయలుదేరారు.

అయితే వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సిద్దూను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరకు అనుమతి దొరకడంతో. . సిద్దూ జర్నలిస్ట్‌ రామన్‌ కశ్యప్ కుటుంబాన్ని పరామర్శించారు.

Tags:    
Advertisement

Similar News