అప్పుడు బండ్ల.. ఇప్పుడు పృధ్వీరాజ్

ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలన్నీ జనరల్ సెక్రటరీ పోస్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. కమిటీలో ఈ పదవి అత్యంత కీలకమైనదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో అటు ప్రకాష్ రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీ పోస్ట్ కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత రాజశేఖర్ ను రంగంలోకి దించారు. ఇక మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా రఘుబాబును నిలబెట్టారు. వీళ్లిద్దరూ […]

Advertisement
Update: 2021-09-23 10:01 GMT

ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలన్నీ జనరల్ సెక్రటరీ పోస్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. కమిటీలో ఈ పదవి అత్యంత కీలకమైనదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో అటు ప్రకాష్ రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీ పోస్ట్ కోసం తీవ్రంగా పోటీ నెలకొంది.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత రాజశేఖర్ ను రంగంలోకి దించారు. ఇక మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా రఘుబాబును నిలబెట్టారు. వీళ్లిద్దరూ కాకుండా, తను కూడా ఇండిపెండెంట్ గా పోటీచేస్తానంటూ బండ్ల గణేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జీవితపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు బండ్ల గణేశ్. తన విమర్శల్ని ఈమధ్య కాస్త తగ్గించాడు. ఇప్పుడు ఆ బాధ్యతను మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడి పదవికి పోటీపడుతున్న పృధ్వీరాజ్ అందుకున్నట్టున్నారు.

తాజాగా ఈయన జీవితపై విమర్శలకు దిగారు. మా అధ్యక్ష బరిలో నిలిచిన జీవిత.. అసోసియేషన్ లో సభ్యుల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు 30 ఇయర్ పృధ్వి. ఇన్ని విమర్శల మధ్య జీవిత ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. వచ్చేనెల 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కమిటీ కోసం ఎన్నిక జరగనుంది.

Tags:    
Advertisement

Similar News