పిల్లలపై టీకా క్లినికల్ ట్రయల్స్ కుదరదన్న కేంద్రం..

భారత్ లో చిన్నపిల్లల టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో అమెరికాకు చెందిన నొవావాక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన చిన్నపిల్లల టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం సీరం సంస్థ చేసిన అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. నొవావాక్స్ కంపెనీ కోవొవాక్స్ పేరుతో కోవిడ్ టీకాను అభివృద్ధి చేసింది. అయితే ఈ టీకాకి ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు కూడా ఇంకా అత్యవసర అనుమతి ఇవ్వలేదు. అన్నిచోట్లా క్లినికల్ ట్రయల్స్ మాత్రమే […]

Advertisement
Update: 2021-07-01 04:20 GMT

భారత్ లో చిన్నపిల్లల టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో అమెరికాకు చెందిన నొవావాక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన చిన్నపిల్లల టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం సీరం సంస్థ చేసిన అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. నొవావాక్స్ కంపెనీ కోవొవాక్స్ పేరుతో కోవిడ్ టీకాను అభివృద్ధి చేసింది. అయితే ఈ టీకాకి ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు కూడా ఇంకా అత్యవసర అనుమతి ఇవ్వలేదు. అన్నిచోట్లా క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి.

భారత్ లో కూడా మార్చినుంచి 18ఏళ్లు దాటినవారిపై నొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. కోవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఈ ట్రయల్స్ చేపట్టింది భారత్ లో నొవావాక్స్ ని మార్కెట్లోకి తేవాలని చూస్తోంది ఈ సంస్థ. తాజాగా చిన్నపిల్లల టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం సీరం సంస్థ డీసీజీఐ అనుమతి కోరింది. 2నుంచి 17ఏళ్లలోపు వయసున్న 920మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతామని అభ్యర్థించింది. ఈ అనుమతిపై నిపుణుల కమిటీ స్పందించింది. పిల్లలపై టీకా ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం సంస్థకు అనుమతివ్వొద్దంటూ నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీంతో క్లినికల్ ట్రయల్స్ ఆగిపోయాయి.

12 నుంచి 17 ఏళ్ల లోపున్న460 మందిపై, 2 నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై దేశవ్యాప్తంగా 10 చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనమతి ఇవ్వాలని సీరం సంస్థ డీసీజీఐని కోరింది. ఈ దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కోవొవాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందనలేదనే విషయాన్ని గుర్తించింది. దీంతో పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్‌ కి అనుమతివ్వాలంటే, ముందు పెద్దలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ కు సంబంధించిన భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించింది. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది.

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ కంపెనీ కోవొవాక్స్‌ టీకాను అభివృద్ది చేసింది. అమెరికా సహా ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అత్యవసర అనుమతికోసం ఆయా దేశాల్లో నొవావాక్స్ కంపెనీ దరఖాస్తులు చేసుకుంది. భారత్ లో టీకా పంపిణీ కోసం ఒప్పందం చేసుకున్న సీరం సంస్థ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది. 18ఏళ్ల పైబడినవారిపై ఇప్పటికే ట్రయల్స్ జరుగుతండగా.. చిన్నారులపై ప్రయోగాలకు మాత్రం కేంద్రం బ్రేక్ వేసింది.

Tags:    
Advertisement

Similar News