జూలై1 నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపులు..

ఏపీలో కర్ఫ్యూ సడలింపులపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం 6గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో సడలింపులు అమలులో ఉన్నాయి. ఆ తర్వాత 12గంటలసేపు నిరవధిక కర్ఫ్యూ అమలవుతుంది. తాజాగా సడలించిన నిబంధనలు జూలై1నుంచి జూలై7 వరకు అమలులో ఉంటాయని తెలిపారు అధికారులు. సడలించిన నిబంధనల ప్రకారం ఉదయం 6గంటలనుంచి రాత్రి 9గంటల వరకు […]

Advertisement
Update: 2021-06-28 03:27 GMT

ఏపీలో కర్ఫ్యూ సడలింపులపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం 6గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో సడలింపులు అమలులో ఉన్నాయి. ఆ తర్వాత 12గంటలసేపు నిరవధిక కర్ఫ్యూ అమలవుతుంది. తాజాగా సడలించిన నిబంధనలు జూలై1నుంచి జూలై7 వరకు అమలులో ఉంటాయని తెలిపారు అధికారులు.

సడలించిన నిబంధనల ప్రకారం ఉదయం 6గంటలనుంచి రాత్రి 9గంటల వరకు జనసంచారానికి అనుమతి ఉంది. వ్యాపార కార్యకలాపాలు కూడా రాత్రి 9గంటల వరకు నిర్వహించుకోవచ్చు. రాత్రి 9నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తారు. అయితే సడలింపులు కేవలం 8జిల్లాలకు మాత్రమే ఇచ్చారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సడలింపులు ఉన్న జిల్లాలివే..
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
గుంటూరు
నెల్లూరు
కడప
కర్నూలు
అనంతపురం

ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో మాత్రం యధావిధిగా పాత నిబంధనలు అమలులో ఉంటాయి. ఈ 5 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు ఇంకా 5 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడ సడలింపులు ఇవ్వలేదు. రాత్రి 6నుంచి ఉదయం 6 వరకు కఠినంగా ఆంక్షలు అమలులో ఉంటాయి. జూలై 7 వరకు ఇక్కడ పాత నిబంధనలే ఉంటాయని తెలిపారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News