పవన్ ద్విపాత్రాభినయం నిజమేనా?

రియల్ లైఫ్ లో పవన్ నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డ్యూయల్ రోల్, నిజజీవితానికి సంబంధించింది కాదు, సినిమాలకు సంబంధించిన మేటర్. త్వరలోనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ, పవన్ ద్విపాత్రాభినయం అంటే మాత్రం ఆ […]

Advertisement
Update: 2021-05-20 08:53 GMT

రియల్ లైఫ్ లో పవన్ నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓవైపు హీరోగా, మరోవైపు రాజకీయ
నాయకుడిగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డ్యూయల్ రోల్,
నిజజీవితానికి సంబంధించింది కాదు, సినిమాలకు సంబంధించిన మేటర్.

త్వరలోనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఇందులో ఆయన డ్యూయల్
రోల్ లో కనిపిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు
కానీ, పవన్ ద్విపాత్రాభినయం అంటే మాత్రం ఆ కిక్కే వేరప్పా.

పవన్ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ చేయలేదు. తీన్ మార్ సినిమాలో రెండు పాత్రలు పోషించినప్పటికీ
దాన్ని డ్యూయల్ రోల్ అనలేం. రెండు కాలాల్లో, సంబంధం లేని రెండు పాత్రలు అలా సాగిపోతుంటాయి.
మరి హరీశ్ శంకర్ పవన్ కోసం ఎలాంటి డ్యూయల్ రోల్ పాత్రలు రాశాడనేది సస్పెన్స్. ప్రస్తుతానికి ఇది
పుకారే. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ పుకారే నిజం అవ్వాలని కోరుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News