నెగెటివ్ గా మారిన పవన్ కల్యాణ్

ఈమధ్య పవన్ కళ్యాణ్ కరోన బారిన పడిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉండడంతో, హోం క్వారంటైన్ లోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా డాక్టర్లు పవన్ దగ్గరికే వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ టైంలో అభిమానులు పార్టీ నేతలు పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. అలా 3 వారాలుగా హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా నిర్వహించిన […]

Advertisement
Update: 2021-05-08 08:55 GMT

ఈమధ్య పవన్ కళ్యాణ్ కరోన బారిన పడిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్
ఉండడంతో, హోం క్వారంటైన్ లోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకున్నాడు. ఆ
తర్వాత కూడా డాక్టర్లు పవన్ దగ్గరికే వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ టైంలో అభిమానులు పార్టీ నేతలు
పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు.

అలా 3 వారాలుగా హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా
నిర్వహించిన పరీక్షల్లో పవన్ కు నెగెటివ్ వచ్చింది. నిన్న పవన్ కి ఆర్.టి.పీ.సి.ఆర్ టెస్ట్ నిర్వహించారు
వైద్యులు. ఆ టెస్టులో పవన్ కి కరోన నెగిటివ్ వచ్చిందని పవన్ టీం నుండి ప్రకటన వచ్చింది. పవన్
కళ్యాణ్ పూర్తిగా కోలుకున్నారని తెలియజేస్తూ జనసేన పార్టీ… మీడియా బులెటిన్ విడుదల చేసింది. దీంతో
పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

పవన్ అయితే రికవర్ అయ్యారు కానీ, అతడి సినిమాలు రెజ్యూమ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే,
కరోనా వికృత రూపం దాల్చింది. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలాంటి టైమ్ లో తన
కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే సాహసం చేయడు పవన్ కల్యాణ్.

ప్రస్తుతం పవన్ చేతిలో 2 సినిమాలున్నాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్, హరిహర
వీరమల్లు సినిమా సెట్స్ పై ఉన్నాయి. హరీశ్ శంకర్ సినిమా సెట్స్ పైకి రావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News