పవన్ ఖాతాలో మరో ఇద్దరు

ఇప్పట్లో పవన్ తన జోరు తగ్గించేలా లేడు. కరోనా వల్ల కాస్త గ్యాప్ తీసుకున్నాడు కానీ, లేకపోతే ఈపాటికి మరో సినిమాకు సంబంధించి ఓ చిన్నపాటి షెడ్యూల్ పూర్తయి ఉండేది. ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నామంటే, ఈ హీరో ఖాతాలో ఇప్పుడు మరో ఇద్దరు దర్శకులు చేరారు. వారిలో ఒకరికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో తెలుసా? ఒకరు వకీల్ సాబ్ డైరక్టర్ వేణుశ్రీరామ్ కాగా, మరొకరు వంశీ పైడిపల్లి. […]

Advertisement
Update: 2021-04-28 09:26 GMT

ఇప్పట్లో పవన్ తన జోరు తగ్గించేలా లేడు. కరోనా వల్ల కాస్త గ్యాప్ తీసుకున్నాడు కానీ, లేకపోతే ఈపాటికి
మరో సినిమాకు సంబంధించి ఓ చిన్నపాటి షెడ్యూల్ పూర్తయి ఉండేది. ఇప్పుడివన్నీ ఎందుకు
చెబుతున్నామంటే, ఈ హీరో ఖాతాలో ఇప్పుడు మరో ఇద్దరు దర్శకులు చేరారు. వారిలో ఒకరికి పవన్
కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో తెలుసా? ఒకరు వకీల్ సాబ్ డైరక్టర్
వేణుశ్రీరామ్ కాగా, మరొకరు వంశీ పైడిపల్లి.

వకీల్ సాబ్ తర్వాత దిల్ రాజ్ మరోసారి పవన్ కల్యాణ్ కు అడ్వాన్స్ అందించిన విషయం తెలిసిందే.
మంచి స్టోరీ, డైరక్టర్ సెట్ అయితే కచ్చితంగా సినిమా చేస్తానని పవన్, దిల్ రాజుకు మాటిచ్చాడు. దీంతో
దర్శకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు దిల్ రాజు. సాధారణంగా తన కాంపౌండ్ దర్శకులకే
పరిమితమయ్యే దిల్ రాజు, ఈసారి కూడా వేణు శ్రీరామ్, వంశీ పైడిపల్లి వైపు మొగ్గుచూపాడు.

ప్రస్తుతం వీళ్లిద్దరూ దిల్ రాజుకు రెండు లైన్స్ చెప్పారు. వాటిని డెవలప్ చేసే పనిలో పడ్డారు. ముందు
దిల్ రాజుకు నచ్చితే, ఆ తర్వాత పవన్ దగ్గరకు ఎంట్రీ ఉంటుంది. అయితే దిల్ రాజు బ్యానర్ పై పవన్
సినిమా వచ్చేది మాత్రం 2023లోనే.

Tags:    
Advertisement

Similar News