భయపెడుతున్న కరోనా మరణాలు

ఒకపక్క దేశంలో కరోనా రెండో సారి విజృంభించడం కాస్త టెన్షన్ పుట్టిస్తుంటే.. మరోపక్క పెరుగుతున్న మరణాల సంఖ్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో వరసగా రెండో రోజు 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా తో తాజాగా 354 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కోవిడ్ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య […]

Advertisement
Update: 2021-03-31 02:45 GMT

ఒకపక్క దేశంలో కరోనా రెండో సారి విజృంభించడం కాస్త టెన్షన్ పుట్టిస్తుంటే.. మరోపక్క పెరుగుతున్న మరణాల సంఖ్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

దేశంలో వరసగా రెండో రోజు 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా తో తాజాగా 354 మరణాలు సంభవించాయి.

ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కోవిడ్ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. నిన్న 27,918 మందికి పాజిటివ్ రాగా..139 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది. ఇప్పటి వరకు 1,14,34,301 మంది కోలుకోగా.. మొత్తం 1,62,468 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండగా మరోపక్క దేశంలో టీకా డ్రైవ్‌ కూడా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా 6,30,54,353 డోసులు వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News