పవన్ ఫ్యాన్స్ కోసం ట్రయిలర్ షో

సాధారణంగా ట్రయిలర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. పెద్ద హీరోల సినిమాల ట్రయిలర్స్ ను ఒకట్రెండు థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. అయితే పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ట్రయిలర్ ను మాత్రం భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ తో సమానంగా ట్రయిలర్ ను కూడా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం ప్రతి ఏరియాలో కొన్ని థియేటర్లను సెలక్ట్ చేసి పెట్టారు. నైజాం, గుంటూరు, నెల్లూరు, వెస్ట్, ఈస్ట్, ఉత్తరాంధ్ర, […]

Advertisement
Update: 2021-03-29 02:28 GMT

సాధారణంగా ట్రయిలర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. పెద్ద హీరోల సినిమాల ట్రయిలర్స్ ను ఒకట్రెండు థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. అయితే పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ట్రయిలర్ ను మాత్రం భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ తో సమానంగా ట్రయిలర్ ను కూడా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం ప్రతి ఏరియాలో కొన్ని థియేటర్లను సెలక్ట్ చేసి పెట్టారు.

నైజాం, గుంటూరు, నెల్లూరు, వెస్ట్, ఈస్ట్, ఉత్తరాంధ్ర, సీడెడ్… ఇలా అన్ని ఏరియాల్లో లిమిటెడ్ థియేటర్లలో ఈ రోజు సాయంత్రం వకీల్ సాబ్ ట్రయిలర్ ను ప్రసారం చేయబోతున్నారు. దీని కోసం ఏకంగా 90కి పైగా థియేటర్లను లాక్ చేశారు.

ప్రతి థియేటర్ కు సంబంధించి ఆల్రెడీ టిక్కెట్ల పంపిణీ జరిగిపోయింది. థియేటర్ల బయట హంగామా ఇప్పటికే మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ హంగామా ఇలానే కొనసాగబోతోంది. మరోవైపు దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో వకీల్ సాబ్ ట్రయిలర్ ను పెట్టబోతున్నాడు.

ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అన్ని ఏరియాల్లో రికార్డ్ స్థాయి బిజినెస్ చేసింది ఈ సినిమా.

Tags:    
Advertisement

Similar News