షర్మిల రాకతో పవన్ అలర్ట్ అవుతున్నారా.. ?

ఇన్నాళ్లూ తెలంగాణ రాజకీయం స్థానికత ఆధారంగా జరిగింది. ఇప్పుడు స్థానికేతరుల తరపున అన్నట్టుగా షర్మిల అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఇతర పార్టీల్లో కలవరం మొదలైంది. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన మూడు జిల్లాల్లో షర్మిల పట్టు సాధించి, మిగతా చోట్ల తమ సామాజిక వర్గాన్ని ఏకం చేసి, కనీస గుర్తింపు తెచ్చుకున్నా.. ప్రధాన పార్టీలకు ఇబ్బందే. అందుకే ఆమెపై అటు నాన్ లోకల్ అనే ముద్ర పూర్తిగా వేయలేక, ఇటు ఆమె రాజకీయ వారసత్వాన్ని కాదనలేక ఇబ్బంది […]

Advertisement
Update: 2021-03-11 23:13 GMT

ఇన్నాళ్లూ తెలంగాణ రాజకీయం స్థానికత ఆధారంగా జరిగింది. ఇప్పుడు స్థానికేతరుల తరపున అన్నట్టుగా షర్మిల అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఇతర పార్టీల్లో కలవరం మొదలైంది. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన మూడు జిల్లాల్లో షర్మిల పట్టు సాధించి, మిగతా చోట్ల తమ సామాజిక వర్గాన్ని ఏకం చేసి, కనీస గుర్తింపు తెచ్చుకున్నా.. ప్రధాన పార్టీలకు ఇబ్బందే. అందుకే ఆమెపై అటు నాన్ లోకల్ అనే ముద్ర పూర్తిగా వేయలేక, ఇటు ఆమె రాజకీయ వారసత్వాన్ని కాదనలేక ఇబ్బంది పడుతున్నారు ప్రధాన పార్టీల నేతలు. వీరితోపాటు పవన్ కల్యాణ్ కూడా షర్మిల ఎంట్రీతో అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు, చిరంజీవి అభిమానులు.. పవన్ ని అంటిపెట్టుకుని ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా జనసేన గుర్తుని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సైన్యం ఉవ్విళ్లూరునా సేనాని బీజేపీ దగ్గర లాక్ అయిపోయే సరికి గాజు గ్లాస్ పవరేంటో ఆ ఎన్నికల్లో బయటపడలేదు.

ఖమ్మం, వరంగల్, నల్గొండ..
గ్రేటర్ పరిధిలో సెటిలర్ల పై పవన్ కల్యాణ్ కు ఆశ ఉంది అదే సమయంలో ఏపీ సరిహద్దు జిల్లాలయిన ఖమ్మం, నల్గొండ పై కూడా ఆయనకు అంచనాలున్నాయి. వరంగల్ లో పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమాన సంఘాలు చురుగ్గా ఉన్నాయి. దీంతో ఆయన ఈ మూడు జిల్లాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. షర్మిల కూడా దాదాపుగా ఈ మూడు జిల్లాలపైనే ఫోకస్ ఎక్కువగా పెట్టిందన్న వార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా అలెర్ట్ అయ్యారు. ఇటీవలే ఈ మూడు జిల్లాలకు కమిటీలు ప్రకటించి కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు. త్వరలో జరగబోయే ఖమ్మం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలకోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ రెండు మున్సిపాల్టీల ఎన్నికలకోసం పవన్ కల్యాణ్ కమిటీలు కూడా ప్రకటించేశారు. అటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికల కోసం తిప్పలు పడుతుంటే.. ఇటు చాపకింద నీరులా పవన్.. వరంగల్, ఖమ్మం మున్సిపాల్టీలపై ఫోకస్ పెట్టారు. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రధానంగా షర్మిల పార్టీపై పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరు నాయకులు సెటిలర్ల ఓట్లపైనే ఎక్కువగా నమ్మకాలు పెట్టుకున్నారు, సామాజిక వర్గాల అండదండలుంటే తమకి ఎదురే లేదనే ఆలోచనలో ఉన్నారు. అందుకే.. తెలంగాణలో షర్మిల ఎంట్రీతో పవన్ అలర్ట్ అవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News