ఆర్ఆర్ఆర్ స్పెషల్ టీజర్

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఊహించని సర్ ప్రైజ్ ఒకటి రెడీ అవుతోంది. ఈ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ టీజర్ రెడీ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు స్పెషల్ టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? దీని వెనక ఓ రీజన్ ఉంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర వీరుల సినిమా కాబట్టి.. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ […]

Advertisement
Update: 2020-12-31 06:31 GMT

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఊహించని సర్ ప్రైజ్ ఒకటి రెడీ అవుతోంది. ఈ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ టీజర్ రెడీ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు స్పెషల్ టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? దీని వెనక ఓ రీజన్ ఉంది.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర వీరుల సినిమా కాబట్టి.. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఏదైనా విడుదల చేస్తే బాగుంటుందనేది మేకర్స్ ఆలోచన. ఆ ఆలోచన నుంచి పుట్టికొచ్చిందే ఈ ఆర్ఆర్ఆర్ స్పెషల్ టీజర్.

ఇప్పటికే రామ్ చరణ్ టీజర్ లుక్ చూశాం. ఎన్టీఆర్ టీజర్ లుక్ కూడా చూశాం. మరి ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఎప్పుడు కనిపిస్తారు. ఆ ముచ్చట జనవరి 26న తీరుతుందంటున్నారు చాలామంది. చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎందుకంటే రామ్ చరణ్ కు కరోనా సోకింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తారు.

Tags:    
Advertisement

Similar News