రజినీకాంత్ కి అస్వస్థత... పార్టీ ప్రకటన ముహూర్తం మారుతుందా...?

డిసెంబర్ 31న తన పార్టీ పేరు ప్రకటించి, జనవరి 1నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానని చెప్పిన రజినీకాంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్త సినిమా షూటింగ్ కోసం ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చారు. అన్నాత్తే అనే ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజులపాటు సజావుగానే సాగింది. అనుకోకుండా చిత్ర యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో షూటింగ్ ఆపివేశారు. షూటింగ్ ఆగిపోయినా రజినీకాంత్ మాత్రం రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయనకు కరోనా టెస్ట్ […]

Advertisement
Update: 2020-12-25 06:15 GMT

డిసెంబర్ 31న తన పార్టీ పేరు ప్రకటించి, జనవరి 1నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానని చెప్పిన రజినీకాంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్త సినిమా షూటింగ్ కోసం ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చారు. అన్నాత్తే అనే ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజులపాటు సజావుగానే సాగింది. అనుకోకుండా చిత్ర యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో షూటింగ్ ఆపివేశారు. షూటింగ్ ఆగిపోయినా రజినీకాంత్ మాత్రం రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయనకు కరోనా టెస్ట్ చేసినా ఫలితం నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే సడన్ గా బీపీ పెరగడంతో రజినీకాంత్ ని ఈరోజు ఆస్పత్రికి తరలించారు. జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయనను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి తరపున విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం రజినీకి రక్తపోటు మినహా మిగతా ఆరోగ్య సమస్యలేవీ లేవు. రక్తపోటు అదుపులోకి రాగానే ఆయనను డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు.

దీంతో అభిమానుల్లో కలవరం తగ్గినా.. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన వ్యవహారం వాయిదా పడుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీ పెట్టడంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నా.. ఎప్పటికప్పుడు పార్టీ ప్రకటనను దాటవేస్తూ వచ్చారు సూపర్ స్టార్. చివరకు డిసెంబర్ 31న పార్టీని ప్రారంభిస్తానని, జనవరి 1నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని తేల్చి చెప్పారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని చెబుతున్న సూపర్ స్టార్ బీజేపీతో కలసి ప్రయాణం చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అటు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా రజినీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో.. తమిళనాట సూపర్ స్టార్ రాజకీయ హడావిడి మొదలైంది. ఇంతలోనే రజినీ ఆస్పత్రిలో చేరడం, పార్టీ ప్రకటనకు మరో 6 రోజులే టైమ్ ఉండటంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మరి కొన్నిరోజులపాటు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలని తెలుస్తోంది.

ఇలాంటి టైమ్ లో పార్టీ ప్రకటన, హడావిడి, రాజకీయ ఉపన్యాసాలు, విమర్శనలు, ప్రతి విమర్శలు అంటే.. రజినీపై మానసికఒత్తిడి పెరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఆయన పార్టీ ప్రకటన వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Similar News