ప్రేక్షకులు కాదు... పరిశ్రమ ఎదురుచూస్తోంది

థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? తెరిస్తే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా? 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నడపడం సాధ్యమా? అసలు ముందుగా ఏ సినిమా విడుదల చేయాలి? ఇవన్నీ ప్రేక్షకుల మనసుల్లో ఉన్న ప్రశ్నలు కాదు. పరిశ్రమ పెద్దలు తమకుతాము వేసుకుంటున్న ప్రశ్నలు. పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే టైపులో ఇన్నాళ్లూ సినిమాలను వాయిదా వేసుకుంటూ వచ్చారు పరిశ్రమ పెద్దలు. బడా సినిమాలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రావడం లేదంటే, సినీజనాల్లో భయం ఏ […]

Advertisement
Update: 2020-11-28 09:45 GMT

థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? తెరిస్తే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా? 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నడపడం సాధ్యమా? అసలు ముందుగా ఏ సినిమా విడుదల చేయాలి? ఇవన్నీ ప్రేక్షకుల మనసుల్లో ఉన్న ప్రశ్నలు కాదు. పరిశ్రమ పెద్దలు తమకుతాము వేసుకుంటున్న ప్రశ్నలు.

పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే టైపులో ఇన్నాళ్లూ సినిమాలను వాయిదా వేసుకుంటూ వచ్చారు పరిశ్రమ పెద్దలు. బడా సినిమాలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రావడం లేదంటే, సినీజనాల్లో భయం ఏ స్థాయిలో గూడుకట్టుకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎట్టకేలకు అందరి అనుమానాల్ని తీర్చడానికి ముందుకొచ్చాడు సాయితేజ్. అతడు నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు పరిశ్రమ అంతా ఈ సినిమాపై దృష్టిపెట్టింది. థియేటర్లకు జనాలొచ్చి, టిక్కెట్లు బాగా తెగితే థియేటర్ వ్యవస్థ గాడిన పడినట్టే.

నిజానికి సోలో బ్రతుకే సినిమా కంటే ముందే కొన్ని థియేటర్లలోకి వస్తున్నాయి. 4వ తేదీ నుంచి చిన్నాచితకా సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. కానీ అసలైన ఫీడ్ బ్యాక్ తెలియాలంటే ఓ మోస్తరు సినిమా పడాలి. అది సోలో బ్రతుకే సో బెటరు సినిమా.

ఇప్పుడీ సినిమాకు కేవలం ఆ యూనిట్ మాత్రమే కాదు, టాలీవుడ్ అంతా ప్రచారం చేయడానికి రెడీగా ఉంది. బాగా ప్రచారం చేయాలి, అందరూ పాజిటివ్ టాక్ వినిపించాలి. జనాల్ని థియేటర్లకు ఆకర్షించాలి. అందుకే ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఫోకస్ పెట్టింది.

Advertisement

Similar News