గ్రేటర్ ఎన్నికలకు జనసేన దూరం... బిజెపికి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్

మూణ్ణెల్లపాటు సాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టడం అంటే ఇదే మరి. మొన్నటికి మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని గట్టిగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాటికి చల్లబడిపోయారు. తన బలాన్ని గుర్తించుకున్నారో, బిజెపి నుంచి వత్తిడి వచ్చిందో గాని, తమ పార్టీ నుంచి పోటీలో నిలవడం లేదని , క్యాడర్ మొత్తం బిజెపికి సపోర్ట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓవైపు నామినేషన్ల గడువు ముగుస్తుంటే.. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో […]

Advertisement
Update: 2020-11-20 10:50 GMT

మూణ్ణెల్లపాటు సాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టడం అంటే ఇదే మరి. మొన్నటికి మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని గట్టిగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాటికి చల్లబడిపోయారు. తన బలాన్ని గుర్తించుకున్నారో, బిజెపి నుంచి వత్తిడి వచ్చిందో గాని, తమ పార్టీ నుంచి పోటీలో నిలవడం లేదని , క్యాడర్ మొత్తం బిజెపికి సపోర్ట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓవైపు నామినేషన్ల గడువు ముగుస్తుంటే.. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదంటూ పవన్ కాడి పడేసారు.

గ్రేటర్ లో పోటీ చేయడానికి సరిపడేంత సమయం కానీ, అభ్యర్థులు కానీ, వనరులు కానీ జనసేన వద్ద లేవు. అయినప్పటికీ ఆయన పార్టీ కమిటీలు ప్రకటించారు. అవినీతిరహిత అభ్యర్థులంటూ ప్రకటనలు ఇచ్చారు. చివరికి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీకి, బిజెపికి మధ్యసమాచార లోపం జరిగిందని చెప్పిన పవన్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. “ఏపీలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి, తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తామని అనుకున్నాం.

కానీ మేం మాట్లాడుకునే టైమ్ లో కరోనా, బిహార్, దుబ్బాక ఎన్నికలొచ్చాయి. అన్నీ సర్దుకొని కూర్చుందామనుకునే టైమ్ కు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చిన్న కన్ఫ్యూజన్ వచ్చిన మాట వాస్తవం. మేం ముందే మాట్లాడుకొని ఉండుంటే ఇలాంటి గ్యాప్ వచ్చేది కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పలేదు.” అన్నారు.

ఇదిలా ఉండగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బి.లక్ష్మణ్ తదితరులు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించారు.

Advertisement

Similar News