సీబీఐకి సోషల్ మీడియా పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మరో కీలకమైన నిర్ణయాన్ని వెలువరించింది. సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టుల కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ సరిగా పనిచేయడం లేదని ఇది వరకు వాదనల సందర్భంగానే హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై స్పీకర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని వ్యాఖ్యానించింది. సీబీఐకి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని గతంలో చెప్పిన హైకోర్టు ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించింది. 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐను […]

Advertisement
Update: 2020-10-12 09:42 GMT

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మరో కీలకమైన నిర్ణయాన్ని వెలువరించింది. సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టుల కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ సరిగా పనిచేయడం లేదని ఇది వరకు వాదనల సందర్భంగానే హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై స్పీకర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని వ్యాఖ్యానించింది. సీబీఐకి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని గతంలో చెప్పిన హైకోర్టు ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించింది. 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐను ఆదేశించింది.

కోర్టులపై వ్యాఖ్యలు చేసిన వారిలో కొందరు విదేశాల్లో ఉండడంతో … సీబీఐ ద్వారా దర్యాప్తు చేయిస్తే ఇంటర్‌పోల్‌ సాయం తీసుకునేందుకు కూడా వీలుంటుందని కోర్టు అభిప్రాయపడింది. కేసును సీబీఐకి అప్పగించడాన్ని ప్రభుత్వం కూడా స్వాగతించింది.

విచారణ సందర్భంగానే సీబీఐకి అప్పగిస్తే తమకేం అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశంలో … తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ విచారణకు సిద్ధమని చెప్పామని వివరించారు.

నిజాయితీగా ఉన్నాం కాబట్టే ఏ విచారణకైనా సిద్దమని తెలియజేశామని… ఇదే ధైర్యాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ వ్యవహారంలో ఎందుకు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే అమరావతి కుంభకోణంపైనా సీబీఐ విచారణకు ముందుకు రావాలని సజ్జల సవాల్ చేశారు.

Advertisement

Similar News