చినబాబు... జూమ్ బాబు... విజయసాయి సెటైర్లు...

అమరావతికోసం ఆగిన గుండె..! అమరావతి పోరులో అసువులు బాసిన ఉద్యమ వీరుడు..! అమరావతికోసం మరో బలిదానం..! రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టింగ్ లివి. వీటికి పరాకాష్టగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల అవమానాలతో ఏకంగా అమరావతిలో 92మంది రైతులు బలైపోయారని, రాష్ట్రంకోసం భూమిని త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా జగన్ మనసు కరగడంలేదని, ఒకేరోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం అంటూ కన్నీరు […]

Advertisement
Update: 2020-10-11 07:21 GMT

అమరావతికోసం ఆగిన గుండె..! అమరావతి పోరులో అసువులు బాసిన ఉద్యమ వీరుడు..! అమరావతికోసం మరో బలిదానం..! రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టింగ్ లివి. వీటికి పరాకాష్టగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వైసీపీ నేతల అవమానాలతో ఏకంగా అమరావతిలో 92మంది రైతులు బలైపోయారని, రాష్ట్రంకోసం భూమిని త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా జగన్ మనసు కరగడంలేదని, ఒకేరోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం అంటూ కన్నీరు కార్చారు. దీంతో ఇటు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడ్డాయి.

ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. సహ మరణాన్ని కూడా అమరావతి ఖాతాలో వేస్తూ శవరాజకీయం చేస్తున్నారంటూ లోకేష్ పై ధ్వజమెత్తారు.

“బాబు నుండి అవినీతి, అసమర్ధత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు, ఇప్పుడు బాబునే మించిపోయాడు. వయో భారంతో సంభవించే సహజ మరణాలను కూడా తన రియల్‌ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగాడు. తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది. ఇంకెంతకాలం అవుట్‌డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం?” అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. మాలోకం అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. సహజ మరణాల్ని కూడా అమరావతి లిస్ట్ లో వేస్తున్నారని, రియల్ ఎస్టేట్ అడ్డా అమరావతిని కాపాడుకోడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు ఏంటంటే… అమరావతికోసం చనిపోయారంటున్న రైతు కొడుకు… తన తండ్రి మరణానికి అమరావతి ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం. తన తండ్రిది సహజ మరణమేనని, అమరావతికోసం ఆగిన గుండె అంటూ… ఆయన మరణాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆ యువకుడు విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

చంద్రబాబుని కూడా విజయసాయిరెడ్డి వదిలిపెట్టలేదు.

” కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించడం చూసి ధైర్యంగా వచ్చినట్టున్నాడు బాబు గారు. జూమ్ లో సందేశాలిచ్చేదానికి పొరుగు రాష్ట్రంలో ఉన్నా, కరకట్ట నివాసంలో ఉన్నా ఒకటే. మహమ్మారి గుట్టుమట్లన్ని తెలుసని చిటికెలేస్తాడు కాని బయటకు రావాలంటే వణికి పోతాడు.” అంటూ బాబుపై సెటైర్లు పేల్చారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ తిరిగొచ్చినా కూడా ఇంటికే పరిమితమయ్యారని, కనీసం ప్రజల్లోకి వచ్చే ఆలోచన కూడా చేయడంలేదని, సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల్నికలిసే ధైర్యం కూడా ఆయనకు లేదని అన్నారు. జూమ్ లో సందేశాలిచ్చే బాబు అక్కడుంటే ఏంటి? ఇక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. తండ్రీ కొడుకులిద్దరిపై ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

Similar News