ఏపీలో మతాల మధ్య చిచ్చు పెడుతారా?- జనసేన, బీజేపీపై ఎపిక్‌ ఫోరం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి జనసేన ప్రమాదకర రాజకీయానికి పూనుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ఇంటలెక్చువల్ అండ్ సిటిజన్ ఫోరం(ఎపిక్ ఫోరం) ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్వేది ఘటనపై విపక్షాలు చేస్తున్న రాజకీయాన్ని ఎపిక్‌ ఫోరం ప్రశ్నించింది. అంతర్వేదిలో రథం దగ్దమవడం విచారకరమని… కానీ దానిపై గగ్గోలు పెడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించడం సరికాదని ఫోరం అభిప్రాయపడింది. విజయవాడలోని ఒక హోటల్‌లో ఎపిక్ ఫోరం సమావేశం జరిగింది. ఇందులో సభ్యుడిగా ఉన్న మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు ప్రసంగించారు. […]

Advertisement
Update: 2020-09-11 21:03 GMT

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి జనసేన ప్రమాదకర రాజకీయానికి పూనుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ఇంటలెక్చువల్ అండ్ సిటిజన్ ఫోరం(ఎపిక్ ఫోరం) ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్వేది ఘటనపై విపక్షాలు చేస్తున్న రాజకీయాన్ని ఎపిక్‌ ఫోరం ప్రశ్నించింది. అంతర్వేదిలో రథం దగ్దమవడం విచారకరమని… కానీ దానిపై గగ్గోలు పెడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించడం సరికాదని ఫోరం అభిప్రాయపడింది.

విజయవాడలోని ఒక హోటల్‌లో ఎపిక్ ఫోరం సమావేశం జరిగింది. ఇందులో సభ్యుడిగా ఉన్న మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు ప్రసంగించారు. రథం దగ్ధం సంఘటనపై ఆందోళన చేస్తున్న బీజేపీ, జనసేన, టీడీపీలు… స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో 10 మంది చనిపోతే కనీసం కన్నెత్తయినా చూశారా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 45 దేవాలయాలను కూల్చినప్పుడు, గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు పవన్‌ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ఫోరం సభ్యులు నిలదీశారు.

గుళ్లు కూల్చినప్పుడు స్పందించని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఎపిక్‌ ప్రశ్నించింది. ఇప్పుడే ఎందుకు పవన్‌ కల్యాణ్ కదిలిపోతున్నారని నిలదీశారు.

Advertisement

Similar News