ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ప్రణబ్ కోమాలో ఉన్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు కరోనా కూడా సోకింది. పశ్చిమ బెంగాల్‌లో డిసెంబర్‌ 11, 1935లో ప్రణబ్ జన్మించారు. ప్రణబ్ 1969లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 34 ఏళ్లకే కాంగ్రెస్‌ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇందిరా హయాంలోనే […]

Advertisement
Update: 2020-08-31 09:15 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ప్రణబ్ కోమాలో ఉన్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు కరోనా కూడా సోకింది.

పశ్చిమ బెంగాల్‌లో డిసెంబర్‌ 11, 1935లో ప్రణబ్ జన్మించారు. ప్రణబ్ 1969లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 34 ఏళ్లకే కాంగ్రెస్‌ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇందిరా హయాంలోనే ఆయన మంత్రిగా చేశారు. ఇందిరాకు నమ్మినబంటుగా ఆయనకు పేరుంది.

1975, 1981,1993,1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సోనియా చేపట్టడంతో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలను ఆయన నిర్వహించారు.

2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004నుంచి 2012 వరకు కాంగ్రెస్‌ సోనియా, మన్మోహన్ తర్వాత స్థానం ప్రణబ్ ముఖర్జీదే. కాంగ్రెస్‌ ట్రబుల్ షూటర్‌ అన్న పేరు ఆయనకుంది. 2012లో ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్నను ప్రణబ్ అందుకున్నారు.

Advertisement

Similar News