ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... పరిస్థితి విషమం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా కోవిడ్-19తో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 5న కరోనా లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరగా.. పరీక్షలో పాజిటివ్ అని తేలడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. వెంటనే ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి ఒక హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం బాలు పరిస్థితి […]

Advertisement
Update: 2020-08-14 07:02 GMT

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా కోవిడ్-19తో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 5న కరోనా లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరగా.. పరీక్షలో పాజిటివ్ అని తేలడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కాగా, గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. వెంటనే ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి ఒక హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం బాలు పరిస్థితి విషమంగా ఉందని, ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.

బాలు ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. ఆయన శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ చికిత్సను అందిస్తున్నట్లు ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధా భాస్కరన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News