కరోనా అప్పుడే పోదు... దశాబ్దాల పాటు ప్రభావం చూపిస్తుంది " డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. త్వరలో వ్యాక్సిన్ వస్తే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ప్రజలపై ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు దాటిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగానికి చెందిన 12 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీళ్లు మరోసారి కరోనా ప్రభావంపై సమీక్ష […]

Advertisement
Update: 2020-08-01 02:03 GMT

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. త్వరలో వ్యాక్సిన్ వస్తే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ప్రజలపై ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు దాటిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగానికి చెందిన 12 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీళ్లు మరోసారి కరోనా ప్రభావంపై సమీక్ష జరిపారు. అనంతరం సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ మీడియాతో మాట్లాడారు.

చైనాలో వైరస్ పుట్టిన తర్వాత ఇతర దేశాల్లో 100 కేసులు నమోదు అయిన వెంటనే డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్పీని ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. వీటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని.. కాబట్టి ప్రజలు జాగ్రత్తతో ఉండాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లను వాడటం, భౌతిక దూరం పాటించాలని సంస్థ తెలిపింది.

ప్రపంచంలో ఈ వైరస్ తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో మరోసారి విజృంభించే అవకాశం ఉందని.. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని టెడ్రోస్ చెప్పారు. మొదట్లో పెద్దగా ప్రభావం కాని దేశాలు ఇప్పుడు గడ్డుపరిస్థితులను ఎదుర్కుంటున్నాయని ఆయన వెల్లడించారు. అయితే పలు దేశాలు కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించినట్లు ఆయన చెప్పారు.

కాగా, కరోనా కారణంగా శాస్త్రసంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇంకా కొన్నింటికి సమాధానం దొరకాల్సి ఉందని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News