గల్వాన్‌లో వెనక్కు వెళ్లిన చైనా బలగాలు

సరిహద్దు గల్వాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా బలగాలు వెనక్కు వెళ్లాయి. కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు చైనా బలగాలు వెనక్కు తగ్గాయి. ఆర్మీ ఉన్నతాధికారుల చర్చల అనంతరం చైనా బలగాలు వెనక్కు మళ్లాయి. చైనా బలగాలు వెనక్కు తగ్గడంతో భారత్ బలగాలు కూడా సరిహద్దు నుంచి కొద్దిగా వెనక్కు వచ్చాయి. రెండు దేశాల మధ్య బఫర్ జోన్‌ను చేశారు. గల్వాన్‌లో చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగించేందుకు చైనా అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇరు దేశాల […]

Advertisement
Update: 2020-07-06 02:42 GMT

సరిహద్దు గల్వాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా బలగాలు వెనక్కు వెళ్లాయి. కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు చైనా బలగాలు వెనక్కు తగ్గాయి. ఆర్మీ ఉన్నతాధికారుల చర్చల అనంతరం చైనా బలగాలు వెనక్కు మళ్లాయి.

చైనా బలగాలు వెనక్కు తగ్గడంతో భారత్ బలగాలు కూడా సరిహద్దు నుంచి కొద్దిగా వెనక్కు వచ్చాయి. రెండు దేశాల మధ్య బఫర్ జోన్‌ను చేశారు. గల్వాన్‌లో చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగించేందుకు చైనా అంగీకరించినట్టు చెబుతున్నారు.

ఇరు దేశాల సైన్యాలు బఫర్ జోన్ దాటి వెళ్లకూడదని ఒక అంగీకారానికి వచ్చారు. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో భారత్ సైనికులపై దొంగదాడి చేసిన చైనా సైన్యం 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. అప్పటి నుంచి గల్వాన్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని, యుద్ద యంత్రాలను మోహరించాయి. మరోవైపు ఆర్మీ అధికారులు చర్చలు జరుపుతూ వచ్చారు. చర్చలు సానుకూలంగా సాగడంతో బఫర్ జోన్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది.

Tags:    
Advertisement

Similar News