ఇండియాలో ఒకే రోజు 12,368 కరోనా కేసులు

ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 12,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ఇండియాలో సంక్రమణ ప్రారంభమైన నాటి నుంచి ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో గడచిన 8 రోజుల్లో ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలకు చేరుకున్న రెండు రోజులకే ఆ సంఖ్య 3.21 లక్షలకు చేరుకోవడం […]

Advertisement
Update: 2020-06-14 03:58 GMT

ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 12,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ఇండియాలో సంక్రమణ ప్రారంభమైన నాటి నుంచి ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

దేశంలో గడచిన 8 రోజుల్లో ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలకు చేరుకున్న రెండు రోజులకే ఆ సంఖ్య 3.21 లక్షలకు చేరుకోవడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. శనివారం 310 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9,195కు చేరుకుంది.

ఇక కరోనా కేసుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండగా.. మరణాల సంఖ్యలో 9వ స్థానానికి చేరుకుంది. మే నెలలో మరణాల సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది.

ఇక శనివారం మహారాష్ట్రలో 3,427 కేసులు, ఢిల్లీలో 2,134 కేసులు, తెలంగాణలో 253 కేసులు, ఏపీలో 222 కేసులు, ఒడిషాలో 225, లడక్‌లో 198, సిక్కింలో 33 కేసులు నమోదయ్యాయి. మార్చి 12న తొలి కేసు నమోదయ్యిన తర్వాత మూడింట ఒక వంతు కేసులు గత పది రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News