మరో రీమేక్ లో పవన్?

పవన్ కల్యాణ్ కు రీమేక్స్ కొత్తకాదు. గతంలో చాలా రీమేక్స్ చేశారు. అంతెందుకు.. అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గబ్బర్ సింగ్ కూడా రీమేకే. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ కూడా రీమేక్ సినిమానే. ఈ క్రమంలో పవన్ చెంతకు మరో రీమేక్ ప్రాజెక్టు చేరింది. మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ రీమేక్ లో పవన్ నటిస్తే […]

Advertisement
Update: 2020-05-14 20:30 GMT

పవన్ కల్యాణ్ కు రీమేక్స్ కొత్తకాదు. గతంలో చాలా రీమేక్స్ చేశారు. అంతెందుకు.. అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గబ్బర్ సింగ్ కూడా రీమేకే. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ కూడా రీమేక్ సినిమానే. ఈ క్రమంలో పవన్ చెంతకు మరో రీమేక్ ప్రాజెక్టు చేరింది.

మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ రీమేక్ లో పవన్ నటిస్తే బాగుంటుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే, ఈ సినిమాలో హీరో రీల్ లైఫ్ లో స్టార్ హీరో పాత్ర పోషించాడు. అలాంటి పాత్ర పవన్ కల్యాణ్ కు బాగుంటుంది.

అందుకే ఓ బడా నిర్మాత ఈ సినిమా రీమేక్ ప్రపోజల్ ను పవన్ ముందుంచాడు. ప్రస్తుతానికైతే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వకీల్ సాబ్ థియేటర్లలోకొచ్చి, క్రిష్ తో చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ మూవీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News