నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాల్సిందిగా కోరుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. డీవోపీటీ ఆమోదం తెలిపి ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపింది. ఆమె పదవీకాలం పొడిగింపు ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌ 30తో నీలం సాహ్ని పదవీకాలం ముగుస్తుంది. ఈనేపథ్యంలో […]

Advertisement
Update: 2020-05-13 20:57 GMT

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాల్సిందిగా కోరుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. డీవోపీటీ ఆమోదం తెలిపి ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపింది.

ఆమె పదవీకాలం పొడిగింపు ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌ 30తో నీలం సాహ్ని పదవీకాలం ముగుస్తుంది. ఈనేపథ్యంలో మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆఖరి నిమిషం పెంపుకు విజ్ఞప్తుల పట్ల కేంద్రం ఇటీవల సానుకూలంగా స్పందించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం 50 రోజులు ముందుగానే కేంద్రానికి లేఖ రాసింది.

పైగా కరోనాపై పోరు సాగిస్తున్న నేపథ్యంలో పరిస్థితులపై పూర్తిగా అవగాహన సాధించిన నీలం సాహ్ని సేవలను మరో ఆరు నెలలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పదవీకాలం పొడిగింపుకు కేంద్రం ఆమోదం తెలపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News