మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా మహమ్మారి కట్టడి కోసం మార్చి 25న తొలిసారి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. కాగా, కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఏప్రిల్ 14న మరో సారి లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది. అయితే దేశంలో చాలా చోట్ల కరోనా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉండటంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ […]

Advertisement
Update: 2020-05-01 09:04 GMT

కరోనా మహమ్మారి కట్టడి కోసం మార్చి 25న తొలిసారి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. కాగా, కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఏప్రిల్ 14న మరో సారి లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది.

అయితే దేశంలో చాలా చోట్ల కరోనా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉండటంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

లాక్‌డౌన్ నిబంధనలు రెడ్‌జోన్‌లో కఠినంగా అమలు చేస్తామని.. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జోన్ల పరిస్థితిని ప్రతీ వారం అంచనా వేసి నిబంధనల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని హోం శాఖ తెలిపింది.

అయితే తెలంగాణ, ఏపీలో కేంద్రం పలు జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. కాగా, తాజా నిబంధనల ప్రకారం ఈ జిల్లాలన్నింటిలో లాక్‌డౌన్ కొనసాగనుంది.

Tags:    
Advertisement

Similar News