చిరంజీవికి మరో హీరో కావాలి

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో మెగాస్టార్ కు ఓ హీరో అవసరం వచ్చింది. కీలకమైన ఓ పాత్ర కోసం మహేష్ బాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి రామ్ చరణ్ ను తీసుకున్నారు. త్వరలోనే చరణ్ తో షూట్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే, ఇప్పుడు చిరంజీవికి మళ్లీ ఇంకో హీరో అవసరం వచ్చింది. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు చిరు. […]

Advertisement
Update: 2020-04-23 05:00 GMT

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో మెగాస్టార్ కు ఓ హీరో అవసరం వచ్చింది. కీలకమైన ఓ పాత్ర కోసం మహేష్ బాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి రామ్ చరణ్ ను తీసుకున్నారు. త్వరలోనే చరణ్ తో షూట్ స్టార్ట్ అవుతుంది.

కట్ చేస్తే, ఇప్పుడు చిరంజీవికి మళ్లీ ఇంకో హీరో అవసరం వచ్చింది. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు చిరు. ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం కూడా స్టార్ హీరో కావాలి. మరి ఈసారి చిరంజీవి ఎవర్ని తీసుకుంటారో చూడాలి.

లూసిఫర్ లో మోహన్ లాల్ హీరో. అతడి అనుచరుడిగా కీలకమైన పాత్రలో ఫృధ్వీరాజ్ కనిపించాడు. తెలుగులో మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. చిరు అనుచరుడిగా, ఫృధ్వీరాజ్ పాత్ర పోషించే మరో హీరో కావాలి. ఆ హీరో ఎవరనే విషయంపై ప్రస్తుతం సుజీత్ వర్క్ చేస్తున్నాడు. ఎవరైతే బాగుంటుందో 3-4 పేర్లతో లిస్ట్ తయారుచేయమని సుజీత్ ను అడిగారట చిరంజీవి.

ఆ లిస్ట్ చూసి, అన్నీ అనుకూలంగా ఉంటే ఒకర్ని చిరంజీవి ఎంపిక చేస్తారు. ఈసారి కూడా మెగా కాంపౌండ్ నుంచే ఎవరో ఒక హీరోను చిరంజీవి సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News