చిరంజీవిని డైరక్ట్ చేయబోతున్న సాహో దర్శకుడు

సాహో సినిమా ఫ్లాప్ తర్వాత మీడియాకు మొహం చూపించలేపోయాడు దర్శకుడు సుజీత్. ఆ సినిమా దెబ్బతో ఇక ఏ హీరో అతడికి ఛాన్స్ ఇవ్వడని అంతా అనుకున్నారు. సుజీత్ మాత్రం తన పట్టు వీడలేదు. మరో మంచి స్టోరీ రాసుకున్నాడు. రామ్ చరణ్ కు కథ చెప్పాడు. కట్ చేస్తే, ఏకంగా చిరంజీవినే డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అవును.. రామ్ చరణ్ తో సినిమా కోసం సుజీత్ ప్రయత్నిస్తే.. అతడికి లూసిఫర్ రీమేక్ ఆఫర్ ఇచ్చాడు […]

Advertisement
Update: 2020-04-14 03:58 GMT

సాహో సినిమా ఫ్లాప్ తర్వాత మీడియాకు మొహం చూపించలేపోయాడు దర్శకుడు సుజీత్. ఆ సినిమా దెబ్బతో ఇక ఏ హీరో అతడికి ఛాన్స్ ఇవ్వడని అంతా అనుకున్నారు. సుజీత్ మాత్రం తన పట్టు వీడలేదు. మరో మంచి స్టోరీ రాసుకున్నాడు. రామ్ చరణ్ కు కథ చెప్పాడు. కట్ చేస్తే, ఏకంగా చిరంజీవినే డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

అవును.. రామ్ చరణ్ తో సినిమా కోసం సుజీత్ ప్రయత్నిస్తే.. అతడికి లూసిఫర్ రీమేక్ ఆఫర్ ఇచ్చాడు చరణ్. చిరంజీవి హీరోగా ఆ సినిమాను రీమేక్ చేసిపెట్టాలని కోరాడు. దీంతో సుజీత్ ఎగిరి గంతేశాడు. ప్రస్తుతం ఆ మూవీకి తన మార్క్ స్టయిల్ యాడ్ చేసే పనిలో ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు.

సరిగ్గా కొరటాల శివ కూడా ఇలానే ఆఫర్ అందుకున్నాడు. భరత్ అనే నేను తర్వాత చరణ్ తో సినిమా చేద్దామనుకున్నాడు. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. కట్ చేస్తే, అదే స్టోరీని ఇంకాస్త పాలిష్ చేసి చిరంజీవితో సెట్ చేశాడు చరణ్. ఇప్పుడు సుజీత్ ను కూడా చిరంజీవి వైపు డైవర్ట్ చేశాడు. మొత్తానికి సుజీత్ కు మంచి అవకాశమే వచ్చిందని చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News