ఓ సరదా సర్వే.... ట్రంప్ పరువు తీసింది

అమెరికాలో కరోనా కలకలం మామూలుగా లేదు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలు కూడా.. తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయలేకపోతున్న ఆయన తీరు.. ఇప్పటికే ప్రపంచం ముందు నవ్వులపాలైంది. భారతదేశం లాంటి అధిక జనాభా ఉన్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశంలోనే.. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో.. అమెరికా లాంటి సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశం.. ఇంతగా విఫలమవడం.. నిత్యం వేల మంది కరోనా బాధితులుగా, మృతులుగా తేలడం.. […]

Advertisement
Update: 2020-04-06 07:17 GMT

అమెరికాలో కరోనా కలకలం మామూలుగా లేదు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలు కూడా.. తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయలేకపోతున్న ఆయన తీరు.. ఇప్పటికే ప్రపంచం ముందు నవ్వులపాలైంది.

భారతదేశం లాంటి అధిక జనాభా ఉన్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశంలోనే.. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో.. అమెరికా లాంటి సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశం.. ఇంతగా విఫలమవడం.. నిత్యం వేల మంది కరోనా బాధితులుగా, మృతులుగా తేలడం.. అగ్ర రాజ్యం పరువును, ఆ దేశాధినేత పరువునూ రోడ్డుకీడ్చిందనే చెప్పాలి.

ఈ వాదనకు ఓ అధ్యయనం ఉదాహరణగా నిలుస్తోంది. ఏప్రిల్ 1 సందర్బంగా… ఓ మీడియా కన్సల్టెంట్ సంస్థ.. ఫూల్స్ డే పేరిట సరదా సర్వే చేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ప్రజల అభిప్రాయాలు తీసుకుంది. జెఫ్ బార్గ్ అనే వ్యక్తి ఈ సర్వే నిర్వహించారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా.. అధ్యయనానికి స్పందించిన 51 శాతం మంది.. అధ్యక్షుడు ట్రంప్ ను తిట్టి పోశారట.

ఏకంగా.. మోస్ట్ ఫూలిష్ అమెరికన్.. అన్న ట్యాగ్ ను ట్రంప్ కు తగిలించేశారట. ఎందుకయ్యా అని ఆరా తీస్తే.. కరోనా నియంత్రణ విషయంలో ఆయన అస్పష్టమైన విధానాలే కారణమన్న కారణం బయటపడింది. అంతే కాదు… కరోనా ఇంతగా అమెరికాను అతలాకుతలం చేస్తున్న వేళ.. చాలామంది బీచుల్లో గడపడం, పార్టీలు చేసుకోవడం, కౌగిలింతలు ఇచ్చుకోవడం చేయడమే కాదు.. అలా ఫొటోలు దిగుతూ.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడాన్ని కూడా తప్పుబట్టారు.

మొత్తంగా చూస్తే.. కరోనా విషయంలో అమెరికా సన్నద్ధతను ఆ దేశస్తులే తప్పుబట్టిన వైనం.. ఈ సర్వే ఫలితంతో తేలింది. ఫూల్స్ డే సందర్భంగా.. కేవలం సరదాకే చేస్తున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించి మరీ చేసిన ఈ సర్వే.. ఏకంగా ట్రంప్ నే మోస్ట్ ఫూలిష్ అమెరికన్ గా తేల్చడం.. ఆ దేశంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మాత్రం బయటపెట్టింది.

Tags:    
Advertisement

Similar News