ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 70 మందికి కరోనా " ఏపీ సీఎం జగన్

ఏపీలో నిన్న, మొన్నటి వరకు అతి తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు కేవలం 12 గంటల్లో అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 87 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. వాటిలో 70 కేసులు ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల నుంచి తిరిగి వచ్చిన వాళ్లే అని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రం నుంచి 1,085 మంది ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లారని… వారిలో ఇప్పటి వరకు 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని జగన్ చెప్పారు. […]

Advertisement
Update: 2020-04-01 19:31 GMT
ఏపీలో నిన్న, మొన్నటి వరకు అతి తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు కేవలం 12 గంటల్లో అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 87 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. వాటిలో 70 కేసులు ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల నుంచి తిరిగి వచ్చిన వాళ్లే అని సీఎం జగన్ వెల్లడించారు.
రాష్ట్రం నుంచి 1,085 మంది ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లారని… వారిలో ఇప్పటి వరకు 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని జగన్ చెప్పారు. పరీక్షించిన వారిలో 70 పాజిటీవ్ కేసులు వచ్చాయని.. మరో 500 మంది పరీక్ష ఫలితాలు రావల్సి ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రం నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారందరి జాబితాను రూపొందించామని.. వారిలో 21 మంది జాడను గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారినే కాకుండా వారితో ప్రయాణించిన వాళ్లు, వారిని కలసిన వాళ్లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఇప్పటికీ రిపోర్ట్ చేయని వాళ్లు 104కి వెంటనే కాల్ చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మర్కజ్ యాత్రికులను కలసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోందని.. వారికి సహకరించి కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి సహకరించాలని.. లేకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఇక, రాష్ట్రంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని అన్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని.. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనపడ్డా వారికి సహకరించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీఎం జగన్ కోరారు.
ప్రపంచవ్యాప్తంగా 81 శాతం కేసులు ఇండ్లలోనే నయమైనట్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది కాబట్టి ఎవరూ భయపడనక్కరలేదని.. అందురూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఇక ఈ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags:    
Advertisement

Similar News