ఐదు లక్షల చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కంగారు పెడుతోంది. ప్రస్తుతం 5 లక్షలకు చేరువలో కరోనా కేసుల సంఖ్య నమోదైంది. 4,71,417 కేసులు దాటాయి. ఇవాళ లేదా రేపు ఉదయం నాటికి ఈ కేసులు ఐదులక్షలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 21, 295 కరోణా మరణాల నమోదు అయ్యాయి. 1,14,642 మంది రికవరీ అయ్యారు. ఇటలీలో రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 74,386 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 7, 503 కరోనా మరణాలు సంభవించాయి. ఇటలీ తర్వాతి స్థానంలో […]

Advertisement
Update: 2020-03-25 20:53 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా కంగారు పెడుతోంది. ప్రస్తుతం 5 లక్షలకు చేరువలో కరోనా కేసుల సంఖ్య నమోదైంది. 4,71,417 కేసులు దాటాయి. ఇవాళ లేదా రేపు ఉదయం నాటికి ఈ కేసులు ఐదులక్షలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 21, 295 కరోణా మరణాల నమోదు అయ్యాయి. 1,14,642 మంది రికవరీ అయ్యారు.

ఇటలీలో రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 74,386 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 7, 503 కరోనా మరణాలు సంభవించాయి.

ఇటలీ తర్వాతి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. యూఎస్‌లో మొత్తం 68,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 900 దాటింది. పరిస్థితులు విషమిస్తుండడంతో న్యూయార్క్‌కు 24 లక్షల మాస్కులు, 1.35 కోట్ల చేతి తొడుగులు, 4 వేల వెంటిలేటర్లను పంపించనున్నట్లు తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

కరోనా నిర్ధారణ కిట్లను సరఫరా చేయాల్సిందిగా దక్షిణ కొరియాను కోరారు ట్రంప్‌. కరోనా తీవ్రతకు కుదేలవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఆమోదంపై సెనేట్, శ్వేతసౌధం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కరోజులో ఫ్రాన్స్‌లో 231, ఇరాన్‌లో 143, నెదర్లాండ్స్‌లో 80, బెల్జియంలో 56, జర్మనీలో 47 మంది మృత్యువాత పడ్డారు.

యూకేలో మరణాల సంఖ్య 465కు చేరింది. 1,452 కొత్త కేసులతో మొత్తం కేసులు 9,529గా ఉన్నాయి. చైనాలో నిన్న నలుగురు చనిపోగా.. 47 కొత్త కేసులు నమోదయ్యాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లో 91 కొత్త కేసులతో మొత్తం 1,063 మంది బాధితులున్నారు. మరణాల సంఖ్య 8గా ఉంది. కేసులు పెరుగుతున్న కారణంగా.. దేశీయ విమానాల రాకపోకలపై ఇమ్రాన్ సర్కారు ఆంక్షలు విధించింది. రష్యాలో రెండో కరోనా మరణం చోటు చేసుకుంది.

భారత్‌లో 664కు కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. అయితే లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటోంది. డోర్-టూ-డోర్ సెర్చ్, టెస్టింగ్, ఐసోలేషన్ చేపడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయిని చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News