ఈ ఆదివారమే దేశమంతా జనతా కర్ఫ్యూ ఎందుకంటే...

ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆదివారం దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎక్కడా చూసినా ఈ జనతా కర్ఫ్యూ మీదే చర్చంతా… రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంద్ ప్రకటించాయి. ప్రజలంతా ఇంట్లోనే నిర్బంధంగా ఉంటున్నారు. బయట ఎవరూ కూడా కనిపించడం లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని మోడీ ఈ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశలో ఉంది. విదేశాలకు వెళ్లివచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ ఉండడం మొదటి దశ. బంధుమిత్రులకు, […]

Advertisement
Update: 2020-03-22 01:51 GMT

ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆదివారం దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎక్కడా చూసినా ఈ జనతా కర్ఫ్యూ మీదే చర్చంతా… రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంద్ ప్రకటించాయి. ప్రజలంతా ఇంట్లోనే నిర్బంధంగా ఉంటున్నారు. బయట ఎవరూ కూడా కనిపించడం లేదు.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని మోడీ ఈ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశలో ఉంది. విదేశాలకు వెళ్లివచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ ఉండడం మొదటి దశ. బంధుమిత్రులకు, సహోద్యోగులకు సోకడం రెండోదశ. ఇప్పటివరకూ రెండో దశలోనే ఉన్నాం మనం.

ఇప్పుడు యావత్ సమాజంలో ఒకరి నుంచి మరొకరికి అంటుకునేది ఈ క్లిష్టమైన మూడో దశ. ఇది జరిగితే సమాజం అతలాకుతలం అవుతుంది. పరిస్థితి చేజారితే మరణమృదంగమే.. ఇటలీ లాంటి దేశాలు ఇప్పుడు నాలుగోదశలో ఉన్నాయి. అక్కడ ఎవరూ జాగ్రత్తలు పాటించకుండా… సెలవులిస్తే అంతా బయట ఎంజాయ్ చేస్తూ తిరగడంతో వైరస్ అందరికీ వ్యాపించింది. వేల మంది చనిపోతున్నారు. ఇటలీలా భారత్ కాకుండా ఉండాలంటే స్వీయ నిర్బంధం తప్పనిసరి అని ప్రధాని ఈ పిలుపునిచ్చారు.

జనతా కర్ఫ్యూను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ , బలగాలను రంగంలోకి దించి ప్రజలను బయటకు రాకుండా చూస్తున్నారు. ప్రజారవాణాను బంద్ చేశారు.

సాధారణ వాతావరణంలో ఈ వైరస్ 3 నుంచి 12 గంటల పాటు మనుగడ సాగిస్తుందట.. మనం ఒక రోజంతా బయటకు రాకుంటే ఆ వైరస్ చచ్చిపోతుంది… వ్యాపించదట… కరోనాను ఎదుర్కొనేందుకు ఇంతకంటే మించిన మార్గం లేకపోవడంతో ప్రజలను రోజంతా కర్ఫ్యూలో ఇళ్లలోనే ఉంచే ప్లాన్ చేశారు.

కరోనా వైరస్ కనుక నాలుగోదశకు చేరుకుంటే ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ప్రజారవాణా అంతా తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది. చైనాలాంటి బలమైన ఆర్థిక, సైనిక దేశం తొందరలోనే వైరస్ ను నియంత్రించింది. మనం అంత బలంగా లేం. కోట్లాది మందికి వైరస్ సోకితే చికిత్సకు సరిపడా వ్యవస్థేలేదు. సో స్వీయ నిర్బంధమే బెటర్ అని ప్రధాని పిలుపునిచ్చాడు.

ఈ వైరస్ సోకిన 14 రోజుల లోపు ఆ లక్షణాలు బయటపడవు. అందుకే విదేశీయులను క్వారంటైన్ చేస్తూ లక్షణాలున్న వారిని నియంత్రించడానికే ఇలా జనతా కర్ఫ్యూను ప్రభుత్వం చేసింది.

సో అందరూ ఈ ఆదివారం కనుక ఇంట్లోనే ఉంటే నాలుగోదశకు పోకుండా వైరస్ ను నియంత్రించిన వారమవుతాం. ప్రబలితే ఇలా కర్ఫ్యూలు, బంద్ లు మరికొన్ని రోజులు భరించాల్సి వస్తుంది. సో తస్మాత్ జాగ్రత్త. ఎవరూ బయటకు రాకండి.

Tags:    
Advertisement

Similar News