కరోనాపై నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో పాటు రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం హైలెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో కరోనా కేసుల వివరాలు, దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే కరోనా పూర్తి స్థాయిలో విజృంభిస్తోందని.. తర్వాత దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మోడీ అధికారులకు సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ […]

Advertisement
Update: 2020-03-18 23:55 GMT

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో పాటు రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం హైలెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో కరోనా కేసుల వివరాలు, దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు.

ఇప్పటికే కరోనా పూర్తి స్థాయిలో విజృంభిస్తోందని.. తర్వాత దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మోడీ అధికారులకు సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాగా, దేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఇవాళ ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడం… ఇప్పటి వరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు రాత్రి 8 గంటలకు వివరించనున్నారు.

Advertisement

Similar News