ఈసీ రమేశ్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన గవర్నర్?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ సీరియస్ అయ్యి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ ను పిలిపించి మాట్లాడారు. ఆయన వివరణ కోరారు. కరోనాపై కేంద్రం సూచనలు, నివేదిక ఆధారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రమేశ్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ నిర్ణయం ప్రకటించే ముందు కేంద్రంలోని ఆరోగ్య కార్యదర్శిని, రాష్ట్ర […]

Advertisement
Update: 2020-03-17 02:49 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ సీరియస్ అయ్యి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ ను పిలిపించి మాట్లాడారు. ఆయన వివరణ కోరారు.

కరోనాపై కేంద్రం సూచనలు, నివేదిక ఆధారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రమేశ్ కుమార్ చెప్పినట్టు తెలిసింది.

అయితే ఈ నిర్ణయం ప్రకటించే ముందు కేంద్రంలోని ఆరోగ్య కార్యదర్శిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సంప్రదించారా? అని రమేశ్ కుమార్ ను గవర్నర్ నిలదీసినట్టు తెలిసింది. వాళ్లు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచిస్తే ఎందుకు తిరస్కరించారని అడిగినట్టు తెలిసింది.

కాగా టీడీపీ ప్రోద్భలంతోనే మీరు ఎన్నికలు వాయిదా వేశారని సీఎం జగన్ ఫిర్యాదు చేశారని దీనిపై ఏమంటారని అడిగినట్టు తెలిసింది. ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలపై తనకు వీడియోలు అందజేసిందని.. గవర్నర్ కు కమిషనర్ అందించినట్టు సమాచారం.

కమిషనర్ అంతిమంగా కరోనా వైరస్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు.. ఎన్నికల్లో చెలరేగిన హింసను ప్రధానంగా ఎన్నికల వాయిదాకు కారణమని గవర్నర్ కు ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

అయితే వైసీపీ ఆరోపణలకు సమర్థమైన వాదనలు వినిపించడంలో ఎన్నికల కమిషనర్ విఫలమయ్యాడని సమర్థించుకోలేకపోయాడని తెలిసింది.

Tags:    
Advertisement

Similar News