కరోనా దెబ్బకు వాయిదా పడిన ఐఫా వేడుకలు

ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కలవర పెడుతోంది. ఏ ఇద్దరి మధ్య చూసినా కరోనాపై చర్చలే. ఈ సందర్భంగా భారీ సభలు, వేడుకలను రద్దు చేసుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చూద్దాంలే అంటూ వాయిదాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) వేడుకలపై పడింది. బాలీవుడ్ సినిమాకు సంబంధించి అత్యంత ఆడంబరంగా జరిగే ఈ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి 21వ ఐఫా ఫంక్షన్ మూడు రోజుల […]

Advertisement
Update: 2020-03-07 00:23 GMT

ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కలవర పెడుతోంది. ఏ ఇద్దరి మధ్య చూసినా కరోనాపై చర్చలే. ఈ సందర్భంగా భారీ సభలు, వేడుకలను రద్దు చేసుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చూద్దాంలే అంటూ వాయిదాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) వేడుకలపై పడింది.

బాలీవుడ్ సినిమాకు సంబంధించి అత్యంత ఆడంబరంగా జరిగే ఈ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి 21వ ఐఫా ఫంక్షన్ మూడు రోజుల పాటు ఇండోర్‌లో జరగాల్సి ఉంది. అయితే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వేడుకల నిర్వాహకులకు కరోనా ప్రభావం గురించి చెప్పడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.

కాగా, వేడుకలు తిరిగి ఎప్పుడు జరపుతామనే విషయాన్ని మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.

Tags:    
Advertisement

Similar News