శిల్పాశెట్టికి పండంటి ఆడబిడ్డ... ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడి..!

ప్రముఖ బాలీవుడ్ నటి మూడో బిడ్డకు జన్మనిచ్చింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు పండండి ఆడబిడ్డ ఈ నెల 15న పుట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. కాగా, వీరికి ఈ బిడ్డ సరోగసీ ద్వారా కలిగినట్లు తెలిపారు. ఈ చిన్నారికి సమీషా శెట్టి కుంద్రా అనే పేరు పెట్టారు. పాపకు సంబంధించిన ఒక ఫొటోను జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌ లో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘మా పూజలు ఫలించాయి.. మా ఇంటిలోకి చిన్నారి దేవత అడుగుపెట్టింది.. తన పేరు సమీషా శెట్టి […]

Advertisement
Update: 2020-02-21 21:09 GMT

ప్రముఖ బాలీవుడ్ నటి మూడో బిడ్డకు జన్మనిచ్చింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు పండండి ఆడబిడ్డ ఈ నెల 15న పుట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. కాగా, వీరికి ఈ బిడ్డ సరోగసీ ద్వారా కలిగినట్లు తెలిపారు. ఈ చిన్నారికి సమీషా శెట్టి కుంద్రా అనే పేరు పెట్టారు. పాపకు సంబంధించిన ఒక ఫొటోను జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌ లో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

‘మా పూజలు ఫలించాయి.. మా ఇంటిలోకి చిన్నారి దేవత అడుగుపెట్టింది.. తన పేరు సమీషా శెట్టి కుంద్రా. సమీషా అంటే మా ఇంటి దేవత లక్ష్మీదేవి.. మా పాపకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ శిల్పాశెట్టి పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News