నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి.... ఈ సారైనా అమలయ్యేనా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మరో సారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులోని దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడో సారి. గతంలో జనవరి 22న, ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్లు జారీ చేసినా.. దోషులు కోర్టుల్లో క్యూరేటీవ్ పిటిషన్లు […]

Advertisement
Update: 2020-02-17 20:50 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మరో సారి డెత్ వారెంట్ జారీ చేసింది.

ఈ కేసులోని దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడో సారి. గతంలో జనవరి 22న, ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్లు జారీ చేసినా.. దోషులు కోర్టుల్లో క్యూరేటీవ్ పిటిషన్లు , రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ శిక్షను జాప్యం చేస్తూ వచ్చారు.

కాగా, సుప్రీంకోర్టులో నిర్భయ దోషులు వేసిన పిటిషన్లను ధర్మాసనం ఇప్పటికే కొట్టేసింది. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్లను కొట్టేశారు. డెత్ వారెంట్ కోసం తీహార్ జైలు అధికారులు ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు పటియాలా కోర్టును డెత్ వారెంట్ తాజాగా ఇవ్వాలని కోరారు.

తీహార్ జైలు అధికారుల పిటిషన్ స్వీకరించిన పటియాలా కోర్టు.. దోషులకు మార్చి 3న ఉరి తీయాలని తాజా వారెంట్ జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News