పేదలకు ఇబ్బంది లేకుండా .... విద్యుత్ చార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచింది. ఈ దిశగా పేదలను పరిగణనలోకి తీసుకుంది. ఎగువ మధ్యతరగతి, ఆపైన విభాగాలకు మాత్రమే పెంపు వర్తించేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి.. కాస్త ఆర్థిక వనరులు పెంచే దిశగా.. అది కూడా నిరుపేదలకు భారం కలగకుండా చూసింది. 500 యూనిట్లు పైబడి విద్యుత్ ను వినియోగించే వారిపైనే భారం మోపింది. ఇప్పటివరకూ.. 500 యూనిట్లు పైపడి విద్యుత్ వినియోగించే వారికి 9 రూపాయల 5 పైసల టారిఫ్ ను […]

Advertisement
Update: 2020-02-10 04:08 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచింది. ఈ దిశగా పేదలను పరిగణనలోకి తీసుకుంది. ఎగువ మధ్యతరగతి, ఆపైన విభాగాలకు మాత్రమే పెంపు వర్తించేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి.. కాస్త ఆర్థిక వనరులు పెంచే దిశగా.. అది కూడా నిరుపేదలకు భారం కలగకుండా చూసింది. 500 యూనిట్లు పైబడి విద్యుత్ ను వినియోగించే వారిపైనే భారం మోపింది.

ఇప్పటివరకూ.. 500 యూనిట్లు పైపడి విద్యుత్ వినియోగించే వారికి 9 రూపాయల 5 పైసల టారిఫ్ ను విధించేవారు. తాజా నిర్ణయం ప్రకారం.. 90 పైసల ధర పెంచారు. ఈ లెక్కన 9 రూపాయల 95 పైసల చొప్పున.. ధర మారింది. ఇది కేవలం.. 500 యూనిట్లకు పైబడిన వారికి మాత్రమే వర్తించనుంది. ఈ ప్రభావం.. ఎగువ మధ్యతరగతితో పాటు కార్పొరేట్ వర్గాలపైనే పడేలా జగన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.

మొత్తానికి విపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. తగిన సమాధానం చెప్పుకొనేలా.. జగన్ ప్రభుత్వం ఈ జాగ్రత్త పడిందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News