చైనాలో చిక్కుకుపోయిన 58 మంది ఆంధ్రులు...

చైనాలో ఉన్న తెలుగు వాళ్లు.. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే.. వైరస్ సోకి మాత్రం కాదు. చైనాలో అమల్లో ఉన్న నిబంధనల వల్ల. అసలు విషయం ఏంటంటే.. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నగరాల్లో ఉహాన్ నగరం కూడా ఒకటి. అక్కడే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 96 మంది యువ ఇంజినీర్లు విధి నిర్వహణ నిమిత్తం అక్కడే ఉంటున్నారు. ఓ సంస్థకు సిబ్బందిగా ఎంపికై అక్కడ పని చేస్తున్నారు. గత ఏడాది […]

Advertisement
Update: 2020-01-29 06:20 GMT

చైనాలో ఉన్న తెలుగు వాళ్లు.. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే.. వైరస్ సోకి మాత్రం కాదు. చైనాలో అమల్లో ఉన్న నిబంధనల వల్ల.

అసలు విషయం ఏంటంటే.. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నగరాల్లో ఉహాన్ నగరం కూడా ఒకటి. అక్కడే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 96 మంది యువ ఇంజినీర్లు విధి నిర్వహణ నిమిత్తం అక్కడే ఉంటున్నారు. ఓ సంస్థకు సిబ్బందిగా ఎంపికై అక్కడ పని చేస్తున్నారు.

గత ఏడాది ఆగస్టు 2019లో చైనా వెళ్లిన వీరిలో.. 38 మంది నవంబర్ నాటికి తిరిగి వచ్చారు. ఇంకో 58 మంది మాత్రం అక్కడే ఉండిపోయారు. వీరిని భారత్ పంపించేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేసినా.. కరోనా ప్రభావంతో అమలులో ఉన్న నిబంధనల కారణంగా.. వాళ్లు అక్కడే ఉండాల్సి వస్తోంది.

తాజా పరిణామంతో 58 మంది యువ ఇంజినీర్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తమవారిని వెనక్కు రప్పించాల్సిందిగా కేంద్రాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో చైనీయులు మృత్యువాత పడుతున్నారు. వారి ప్రభావంతో ఇతర దేశస్తులూ భయపడుతున్నారు. చైనాకు వెళ్లాలన్నా ఆలోచిస్తున్నారు. అందుకే.. ఆ 58 మంది పరిస్థితి ఎలా ఉందో అని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News