'మండలి రద్దుపై.. మాకేం అభ్యంతరం లేదు'

శాసన మండలి రద్దుపై.. ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు పదవులు ప్రధానం కాదని మండలి సభ్యులు, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా జరుగుతున్న పరిపాలనలో తామూ భాగంగా ఉన్నామని అన్నారు. మండలి రద్దు దిశగా తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన […]

Advertisement
Update: 2020-01-28 03:18 GMT

శాసన మండలి రద్దుపై.. ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు పదవులు ప్రధానం కాదని మండలి సభ్యులు, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా జరుగుతున్న పరిపాలనలో తామూ భాగంగా ఉన్నామని అన్నారు. మండలి రద్దు దిశగా తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

తమకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన మండలి.. ప్రస్తుతం ఆ దిశగా సాగడం లేదని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వాళ్లు ఎప్పుడైనా శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు.

తమకు పదవులపై ఆశ లేదని.. అందుకే మండలి రద్దుకు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. మండలి రద్దుతో తమ పదవులు పోతాయన్న బాధ కూడా లేదని.. ప్రజా సేవలో నిరంతరం పని చేస్తామని చెప్పుకొచ్చారు.

ఈ ఇద్దరికే కాదు.. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్లు.. భవిష్యత్తులో మండలిలో సభ్యత్వంపై ఆశలు పెట్టుకున్నవాళ్లు కూడా.. ఇదే తీరున స్పందిస్తున్నారు. అధినేత, ముఖ్యమంత్రి జగన్ బాటలో నడుస్తూ.. మండలి రద్దును స్వాగతిస్తున్నారు.

ఇప్పటివరకూ.. తన పార్టీలో ఒక్కరి నుంచి కూడా.. మండలి రద్దుకు వ్యతిరేకంగా నేతలు మాట్లాడక పోవడంపై.. సీఎం జగన్ కూడా సంతోషంగా ఉన్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News