మండలి రద్దుకు జనసేన ఎమ్మెల్యే మద్ధతు...

శాసనమండలి రద్దు తీర్మానానికి పూర్తి మద్దతు తెలిపారు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. శాసనమండలి రద్దుపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. సీఎం జగన్‌ 7 నెలలుగా అభివృద్ధి పైనే దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారని… అయితే ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్ర అభివృద్ధి చెందడంకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్లులను టీడీపీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు రాపాక. చంద్రబాబు బ్రిటిష్ పాలకులలాగా విభజించు-పాలించు విధానాన్ని అనుసరించారని… […]

Advertisement
Update: 2020-01-27 05:28 GMT

శాసనమండలి రద్దు తీర్మానానికి పూర్తి మద్దతు తెలిపారు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. శాసనమండలి రద్దుపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. సీఎం జగన్‌ 7 నెలలుగా అభివృద్ధి పైనే దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారని… అయితే ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్ర అభివృద్ధి చెందడంకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్లులను టీడీపీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు రాపాక.

చంద్రబాబు బ్రిటిష్ పాలకులలాగా విభజించు-పాలించు విధానాన్ని అనుసరించారని… అన్నదమ్ముళ్ళుగా ఉన్న కులాలను రెండుగా విడదీశారని మండిపడ్డారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అన్నారు. చంద్రబాబు నీరు-చెట్టు అని…. ప్రజాధనాన్ని దోచేశారని… నీళ్ళలో కలిపేశారని… అభివృద్ధి ఏమి చేయలేదన్నారు రాపాక.

అయితే జగన్‌ మాత్రం గత పాలకులలాగా కాకుండా… ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువేనని… ఆ ఆవిషయాన్ని సీఎం జగన్‌ గుర్తించారు కాబట్టే అమ్మ బడి పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. అదేవిధంగా ఎస్పీ కాలనీలలో సిమెంట్‌ రోడ్లు వేసి అభివృద్ధి చేయడం చాలా ఆనందించదగ్గ విషయమని…. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు రాపాక.

అసెంబ్లీలోని అధికార పార్టీకి చెందిన 151 మంది సభ్యులతోపాటు తాను కూడా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్వాగతిస్తున్నానన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC