కృష్ణపట్నం పోర్టుకు కోత పెట్టిన ప్రభుత్వం

కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డుపుల్లవేస్తూ వస్తున్న కృష్ణపట్నం పోర్టు కంపెనీకి తనదైన శైలిలో ప్రభుత్వం సమాధానం చెప్పింది. ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టును నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా… కృష్ణపట్నం పోర్టు అడ్డుపుల్ల వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వాలు కృష్ణపట్నంపోర్టుకు అటు 30 కిలో మీటర్లు, ఇటు 30 కిలోమీటర్లు మరో పోర్టు నిర్మించడానికి వీల్లేకుండా కృష్ణపట్నం పోర్టుకు ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఒకవేళ ఆ పరిధిలో మరో […]

Advertisement
Update: 2019-12-31 01:17 GMT

కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డుపుల్లవేస్తూ వస్తున్న కృష్ణపట్నం పోర్టు కంపెనీకి తనదైన శైలిలో ప్రభుత్వం సమాధానం చెప్పింది.

ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టును నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా… కృష్ణపట్నం పోర్టు అడ్డుపుల్ల వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వాలు కృష్ణపట్నంపోర్టుకు అటు 30 కిలో మీటర్లు, ఇటు 30 కిలోమీటర్లు మరో పోర్టు నిర్మించడానికి వీల్లేకుండా కృష్ణపట్నం పోర్టుకు ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఒకవేళ ఆ పరిధిలో మరో పోర్టు నిర్మించాలనుకుంటే ఆ అధికారం కృష్ణపట్నం పోర్టు కంపెనీకే కట్టబెట్టారు.

ఈ వెసులుబాటును అడ్డుపెట్టుకుని రామాయపట్నం పోర్టును నిర్మించకుండా కృష్ణపట్నంపోర్టు యాజమాన్యం అడ్డుపుల్ల వేస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలను కత్తిరించింది. కృష్ణపట్నంపోర్టు ముఖ పరిధిని తగ్గించింది. కృష్ణపట్నం పోర్టుకు అటుఇటు 30 కి.మీ.లలో మరో పోర్టు నిర్మించడానికి వీల్లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన ప్రత్యేక హక్కులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

Tags:    
Advertisement

Similar News