కథలొద్దు బాబు... విశాఖ, కర్నూలుకు నువ్వు అనుకూలమా? వ్యతిరేకమా?...

ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించే వాడు ఎవడా అని ఇంతకాలం ఎదురుచూశామని… ఇంతకాలానికి జగన్‌ వచ్చారన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించేందుకు జగన్‌ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని… ఇలాంటి సమయంలో జగన్‌మోహన్ రెడ్డికి అండగా ఉత్తరాంధ్ర ప్రజలు నిలబడాలని తమ్మినేని కోరారు. ఉత్తరాంధ్ర కోసం ఇంత ధైర్యంగా నిలబడిన జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదులుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు జగన్‌ ముందుకొస్తుంటే టీడీపీ […]

Advertisement
Update: 2019-12-25 02:14 GMT

ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించే వాడు ఎవడా అని ఇంతకాలం ఎదురుచూశామని… ఇంతకాలానికి జగన్‌ వచ్చారన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించేందుకు జగన్‌ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని… ఇలాంటి సమయంలో జగన్‌మోహన్ రెడ్డికి అండగా ఉత్తరాంధ్ర ప్రజలు నిలబడాలని తమ్మినేని కోరారు. ఉత్తరాంధ్ర కోసం ఇంత ధైర్యంగా నిలబడిన జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదులుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు జగన్‌ ముందుకొస్తుంటే టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని తమ్మినేని ప్రశ్నించారు. చంద్రబాబు కథలు చెప్పడం మాని… విశాఖను పరిపాలన రాజధాని చేయడానికి వ్యతిరేకమా? అనుకూలమా? అన్నది చెప్పాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఇష్టమా? కాదా? అని చంద్రబాబు సూటిగా చెప్పాలన్నారు.

అమరావతిలో ఎందుకు టీడీపీ ఉద్యమం చేస్తోందో చెప్పాలన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుప్పకూలినందుకు చేస్తున్నారా?… కొన్న భూములు ఫట్ అయిపోయాయి అని చేస్తున్నారా? అని నిలదీశారు. అమరావతిలో ఉద్యమం చేయడానికి అక్కడ ఏం నష్టం జరిగిందని నిలదీశారు. ఇంత జరిగినా టీడీపీకి ఇంకా బుద్ధి రాలేదన్నది అమరావతిలో చేస్తున్న కృత్తిమ ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. భూములు కొన్న వారు, పచ్చచొక్కాల వారు మాత్రమే అమరావతిలో ఆందోళన చేస్తున్నారని విమర్శించారు.

ఉత్తరాంధ్ర కోసం సాహసం చేసిన జగన్‌ వెంట రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజలు నిలబడి నైతిక మద్దతు ఇస్తారని తమ్మినేని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News