రేపిస్ట్‌లకు పవన్‌ సపోర్టు... ఇదేనా పవనిజం...

రేపిస్టులను ఉరి తీయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని… కానీ అలా చేసే హక్కు ఎవరికీ లేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఆయన మానసికంగా ఏదో సీరియస్ ప్రాబ్లమ్‌ ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. దేశమంతా రేపిస్టులను కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెట్టుకుంటుంటే పవన్‌కు మాత్రం రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయని విమర్శించారు. రేపిస్టులకు వంతపాడడమే పవనిజమా అని ప్రశ్నించారు. ‘రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని […]

Advertisement
Update: 2019-12-04 00:13 GMT

రేపిస్టులను ఉరి తీయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని… కానీ అలా చేసే హక్కు ఎవరికీ లేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఆయన మానసికంగా ఏదో సీరియస్ ప్రాబ్లమ్‌ ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.

దేశమంతా రేపిస్టులను కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెట్టుకుంటుంటే పవన్‌కు మాత్రం రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయని విమర్శించారు. రేపిస్టులకు వంతపాడడమే పవనిజమా అని ప్రశ్నించారు.

‘రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెట్టుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?’ అని ట్విట్టర్‌ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ హైదరాబాద్‌ దిశ ఘటనపై స్పందిస్తూ నలుగురు రేపిస్టుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ”హైదరాబాద్‌లో రేప్‌ చేసిన నలుగురిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడితే వేలాది మంది వచ్చారు. ఉరి తీయాలంటున్నారు. ఒక సారి ఒక రేప్ కేసులో ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి.. రేప్‌ చేసిన వారి మర్మాంగాలు కోసేయాలన్నాడు. జడ్జికి కూడా అంత కోపం వచ్చింది. పరిస్థితిని ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్తున్నారు?. ఆడపిల్ల బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని బెత్తంతో కొట్టండి. చర్మం ఊడిపోయేలా కొట్టండి. అత్యాచారం చేసిన వారిని అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఉరి తీయాలంటున్నారు. ఒక మనిషిని అలా చంపే హక్కు మనకు లేదు. సమాజం ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అయితే పవన్ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. రేపిస్టులకు అండగా నిలవడం ఏమిటంటూ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. రాయలసీమలో పవన్ పర్యటన సందర్భంగా చేస్తున్న ఇతర వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు జోకులేసుకుంటున్నారు. ‘పవన్…. కేఏ పాల్ ను దాటేశారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వ్యక్తితో కలిసి నాదెండ్ల మనోహర్ ఎలా ఉంటున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. పలు వ్యంగ్య చిత్రాలను కూడా నెటిజన్లు తయారు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News