మద్యం ధరలను తగ్గించాలి.... ఇసుక బాబులాగే ఇవ్వాలి " కోట్ల

మద్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ధరలను పెంచడంపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. తక్షణం మద్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ ధరలు పెంచి వినియోగదారులపై భారం వేయడం సరికాదని మండిపడ్డారు. మద్యం ధరల పెంపు పెనుభారంగా మారిందన్నారు. ఇసుక ధరలు భరించలేని విధంగా ఉన్నాయని కోట్ల విమర్శించారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించారని చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా ప్రజల […]

Advertisement
Update: 2019-11-28 21:20 GMT

మద్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ధరలను పెంచడంపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. తక్షణం మద్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ ధరలు పెంచి వినియోగదారులపై భారం వేయడం సరికాదని మండిపడ్డారు. మద్యం ధరల పెంపు పెనుభారంగా మారిందన్నారు.

ఇసుక ధరలు భరించలేని విధంగా ఉన్నాయని కోట్ల విమర్శించారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించారని చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా ప్రజల ఇళ్లకు వచ్చేదన్నారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని… కొత్త ప్రభుత్వం కూడా చంద్రబాబు తరహాలోనే ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు.

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అమరావతిలో పనులు మధ్యలో ఆగిపోయాయని కర్నూలు మాజీ ఎంపీ అయిన కోట్ల విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News