పవన్‌తో పోల్చడం జార్జిరెడ్డిని అవమానించడమే.... చంద్రబాబుకు పవన్‌ ఒక డమ్మీ

స్డూడెంట్ నాయకుడు జార్జిరెడ్డితో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను పోల్చడాన్ని జార్జిరెడ్డి స్నేహితుడు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ తప్పుపట్టారు. జార్జిరెడ్డి ఎక్కడ? పవన్‌ కల్యాణ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ ను జార్జిరెడ్డితో పోల్చడం అంటే జార్జిరెడ్డిని అవమానించడమేనన్నారు. జార్జిరెడ్డి చెప్పింది చేసి చూపించేవాడని గుర్తు చేశారు. జార్జిరెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేవాడన్నారు. పవన్‌ కల్యాణ్ మాత్రం నమ్మింది మాట్లాడుతారు… ట్విట్టర్‌ వరకు పరిమితం అవుతారన్నారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ చెప్పింది ఒకటైనా చేశారా […]

Advertisement
Update: 2019-11-24 21:51 GMT

స్డూడెంట్ నాయకుడు జార్జిరెడ్డితో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను పోల్చడాన్ని జార్జిరెడ్డి స్నేహితుడు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ తప్పుపట్టారు.

జార్జిరెడ్డి ఎక్కడ? పవన్‌ కల్యాణ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ ను జార్జిరెడ్డితో పోల్చడం అంటే జార్జిరెడ్డిని అవమానించడమేనన్నారు. జార్జిరెడ్డి చెప్పింది చేసి చూపించేవాడని గుర్తు చేశారు. జార్జిరెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేవాడన్నారు.

పవన్‌ కల్యాణ్ మాత్రం నమ్మింది మాట్లాడుతారు… ట్విట్టర్‌ వరకు పరిమితం అవుతారన్నారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ చెప్పింది ఒకటైనా చేశారా అని ప్రశ్నించారు. మూడు నెలలకొకసారి రావడం, ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టడం తప్ప ఏదైనా సాధించారా? అని తమ్మారెడ్డి నిలదీశారు.

జార్జిరెడ్డి చేగువేరాకు ఫాలోవర్‌ అయితే… పవన్‌ కల్యాణ్ చేగువేరాకు ఒక ఫ్యాన్ మాత్రమేనన్నారు. ఫ్యాన్‌ ఫోటోలు పెట్టుకుంటాడని… ఫాలోవర్‌గా ఉన్న వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తి విధానాలను ఫాలో అయి చూపిస్తారన్నారు. జార్జిరెడ్డితో పవన్‌ కల్యాణ్‌ను పోల్చి జార్జ్‌ను అవమానించవద్దని కోరారు.

పవన్‌ కల్యాణ్ చంద్రబాబుకు ఒక డమ్మీ మాత్రమేనన్నారు. పవన్‌ కల్యాణ్ వల్ల ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని ఆశించిన వారిలో తానూ ఒకడినని… కానీ రెండు సార్లు చంద్రబాబుకు డమ్మీగా పవన్ కల్యాణ్ పనిచేశారన్నారు. ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పిన పవన్‌కల్యాణ్… మొన్నటి ఎన్నికల్లో కొన్నిస్థానాల్లో మాత్రమే ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు.

నారా లోకేష్ పోటీ చేసిన చోట ప్రచారానికి కూడా ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లోనూ పవన్‌ మళ్లీ ఇదే చేయరన్న గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ఆవేశం ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ ఏమీ చేయలేకపోయారని… మరో ఐదేళ్లు గడిస్తే ఆ ఆవేశం కూడా ఉండదని…. అప్పుడేం సాధించగలరని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

ఒక్కసీటు మాత్రమే గెలిచిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అయ్యే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఒక డమ్మీ అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు… ఆ విషయం పవన్‌ కల్యాణ్‌కు కూడా తెలుసు అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News