పవన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు...

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసిన పవన్ రెండింట్లోనూ దారుణంగా ఓడిపోయాడు. అయితే రాజకీయాల్లో ఫ్లాప్ అవ్వడంతో… ఇక పవన్ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతాడని…. పవన్ ఓడిపోయాక ఆయనవద్దకు పలు సినిమా ప్రాజెక్టులు కూడా వచ్చాయని వార్తలొచ్చాయి. అన్న కొడుకు రాంచరణ్ కూడా బాబాయ్ పవన్ తో ఓ సినిమా తీస్తానని అన్నాడు. కానీ పవన్ మాత్రం తాను సినిమాల్లో నటించనని.. ఆ ఉద్దేశం లేదని చెప్పాడు. సినిమాలపై తనకు ఆసక్తి లేదని కూడా చెప్పాడు. […]

Advertisement
Update: 2019-11-24 07:49 GMT

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసిన పవన్ రెండింట్లోనూ దారుణంగా ఓడిపోయాడు. అయితే రాజకీయాల్లో ఫ్లాప్ అవ్వడంతో… ఇక పవన్ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతాడని…. పవన్ ఓడిపోయాక ఆయనవద్దకు పలు సినిమా ప్రాజెక్టులు కూడా వచ్చాయని వార్తలొచ్చాయి. అన్న కొడుకు రాంచరణ్ కూడా బాబాయ్ పవన్ తో ఓ సినిమా తీస్తానని అన్నాడు.

కానీ పవన్ మాత్రం తాను సినిమాల్లో నటించనని.. ఆ ఉద్దేశం లేదని చెప్పాడు. సినిమాలపై తనకు ఆసక్తి లేదని కూడా చెప్పాడు.

అయితే… తాజాగా టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సంచలన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ తో తాను సినిమా తీయబోతున్నానని.. హిందీ ‘పింక్’ మూవీని పవన్ తో తీస్తున్నట్టు కన్ఫాం చేశాడు. పవన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలిపాడు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వగానే సినిమా మొదలవుతుందని ప్రకటించాడు.

ఇలా టాలీవుడ్ అగ్రనిర్మాతే పవన్ తో సినిమా విషయం అధికారికంగా చెప్పడంతో ఇప్పుడిది ఇండస్ట్రీ టాక్ అయ్యింది. పవన్ నేరుగా తాను సినిమాల్లో నటిస్తానని ఇప్పటివరకు చెప్పలేదు. కానీ దిల్ రాజ్ చెప్పింది అబద్ధమైతే కాదని అంటున్నారు… సో పవన్ తన మనసు మార్చుకొని మళ్లీ సినిమాల బాట పడుతున్నట్లే అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News