పవనూ... ఏకవీర అంటే వీరుడో, మగాడో కాదు... ఒక దేవత

ప్రాస కలిసింది కదా అని పవన్ కల్యాణ్ వాడేస్తున్న కొన్ని పదాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. కర్నూలులో హైకోర్టు పెట్టుకుని, పులివెందులను రాజధానిగా చేసుకోండి అంటూ రాయలసీమ ప్రాంతాన్ని హేళన చేస్తూ మంగళవారం విశాఖలో మాట్లాడిన పవన్ కల్యాణ్… పనిలో పనిగా ఉత్తరాంధ్ర అర్హతలను కూడా ప్రశ్నించారు. అవకాశం వస్తే మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిని రాజధానిగా చేయాలకుంటారు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై అటు సీమ వాసులతోపాటు ఉత్తరాంధ్ర వారు […]

Advertisement
Update: 2019-11-05 21:30 GMT

ప్రాస కలిసింది కదా అని పవన్ కల్యాణ్ వాడేస్తున్న కొన్ని పదాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. కర్నూలులో హైకోర్టు పెట్టుకుని, పులివెందులను రాజధానిగా చేసుకోండి అంటూ రాయలసీమ ప్రాంతాన్ని హేళన చేస్తూ మంగళవారం విశాఖలో మాట్లాడిన పవన్ కల్యాణ్… పనిలో పనిగా ఉత్తరాంధ్ర అర్హతలను కూడా ప్రశ్నించారు.

అవకాశం వస్తే మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిని రాజధానిగా చేయాలకుంటారు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై అటు సీమ వాసులతోపాటు ఉత్తరాంధ్ర వారు కూడా భగ్గుమంటున్నారు. చీపురుపల్లి ఆంధ్రప్రదేశ్‌లో లేదా అని నిలదీస్తున్నారు. చీపురుపల్లిని రాజధాని చేయాల్సిందిగా తామేమీ అడగలేదని… కాకపోతే చీపురుపల్లికి అర్హతలు లేవు అన్నట్టు మాట్లాడడం ఏమిటని పవన్‌ కల్యాణ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పవన్ చేసిన వ్యాఖ్యలపై రాయలసీమకు చెందిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని… వారంతా కౌరవులు అని… జనసేనకు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడని అంటే ”ఏకవీర” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

కౌరువులు 100 మందే అన్న విషయం ముందుగా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. ”ఏకవీర” అంటే పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్టు వీరుడో, మగాడో కాదని… కాకతీయుల కాలం నాటి ప్రధాన దేవత అని, అష్టాదశ శక్తి పీఠాలలో ఏకవీర ఒక పీఠం అని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

చీపురుపల్లిని రాజధాని చేయాలని బొత్స అనుకుంటారు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా గోపిరెడ్డి తన అభిప్రాయం వెల్లడించారు. ”అవును తప్పేముంది?చీపురుపల్లి, మరో రాయలసీమలోని ఊరో ఆంధ్రప్రదేశ్ లో లేవా?. చీపురుపల్లి కాకుంటే ఇచ్చాపురం…చెన్నై, బెంగుళూర్ నగరాలు ఆయా రాష్ట్రాల నడిబొడ్డునేం లేవని ఈ గాడిదకు తెలిస్తే కదా” అని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రలో పక్క జిల్లాల వారు గెలిచి బాగుపడుతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. సొంత ఊర్లో గెలవలేని చిరంజీవి ఎక్కడి నుంచి గెలిచారో గుర్తు లేదా అని పవన్ కల్యాణ్‌ను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News