మహేష్ తో సవాల్ చేయను

ఎన్నో సినిమాల్లో అత్తా అల్లుళ్ల సవాల్ చూశాం. అత్తను అల్లుడు సవాల్ చేస్తాడు. చివర్లో ఆమె మెడలు వంచుతాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాపై కూడా ఇలాంటి పుకారే పుట్టింది. మహేష్ బాబు, విజయశాంతి మధ్య ఇలాంటి యాక్షన్ సన్నివేశం ఒకటి ఉంటుందని కథనాలు వచ్చాయి. వీటిని విజయశాంతి ఖండించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి.. సినిమాలో మహేష్ కు తనకు మధ్య రిలేషన్ షిప్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. తనకు మహేష్ కు మధ్య […]

Advertisement
Update: 2019-10-31 03:00 GMT

ఎన్నో సినిమాల్లో అత్తా అల్లుళ్ల సవాల్ చూశాం. అత్తను అల్లుడు సవాల్ చేస్తాడు. చివర్లో ఆమె మెడలు వంచుతాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాపై కూడా ఇలాంటి పుకారే పుట్టింది.

మహేష్ బాబు, విజయశాంతి మధ్య ఇలాంటి యాక్షన్ సన్నివేశం ఒకటి ఉంటుందని కథనాలు వచ్చాయి. వీటిని విజయశాంతి ఖండించారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి.. సినిమాలో మహేష్ కు తనకు మధ్య రిలేషన్ షిప్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. తనకు మహేష్ కు మధ్య ఎలాంటి సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉండవని.. తమ పాత్రల మధ్య బంధం చాలా అన్యోన్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందుకొచ్చిన విజయశాంతి, ఫిలిం మేకింగ్ చాలా మారిపోయిందన్నారు. అయితే ఇలా మారడం తనలాంటి నటులకు చాలా ప్లస్ అంటున్నారామె.

ఒకప్పుడు నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని, కానీ టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడ నటించడం చాలా సౌకర్యంగా ఉందని చెప్పుకొచ్చింది. టెక్నికల్ అంశాలు ఎన్ని మారినా తనకు సంబంధం లేదని, దర్శకుడు చెప్పింది చెప్పినట్టు నటించడమే తనకు తెలుసని అంటున్నారు.

ఒకప్పుడు కృష్ణతో పనిచేసిన విజయశాంతి, ఇప్పుడు మహేష్ తో పనిచేయడం చాలా బాగుందని చెప్పుకొచ్చారు. మహేష్ తనను ఆప్యాయంగా అమ్మ అని, కొన్నిసార్లు మేడమ్ అని పిలుస్తాడని చెప్పుకొచ్చింది. తను మాత్రం మహేష్ ను బాబు అని సంభోదిస్తానని తెలిపారు.

మహేష్ సూపర్ స్టార్ అవుతాడనే విషయాన్ని కొడుకు దిద్దిన కాపురం సినిమా టైమ్ లోనే తను మీడియాతో చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందంటున్నారు విజయశాంతి.

Tags:    
Advertisement

Similar News