తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ... వల్లభనేని వంశీపై కేసు నమోదు

మరో టీడీపీ ఎమ్మెల్యే నేరం చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన వ్యవహారంలో వంశీపై కేసు నమోదు అయింది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నించడంతో పాటు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నది అభియోగం. ఓటర్లను ఆకర్షించేందుకు నియోజక వర్గంలోని బాపులపాడు మండలంలో వేలాది ఇళ్ల పట్టాలను వల్లభనేని వంశీ పంచిపెట్టారు. అప్పటికే బదిలీ అయిన […]

Advertisement
Update: 2019-10-18 19:03 GMT

మరో టీడీపీ ఎమ్మెల్యే నేరం చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన వ్యవహారంలో వంశీపై కేసు నమోదు అయింది.

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నించడంతో పాటు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నది అభియోగం. ఓటర్లను ఆకర్షించేందుకు నియోజక వర్గంలోని బాపులపాడు మండలంలో వేలాది ఇళ్ల పట్టాలను వల్లభనేని వంశీ పంచిపెట్టారు.

అప్పటికే బదిలీ అయిన తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ ఇళ్ల పట్టాలను వల్లభనేని వంశీ సృష్టించారు. వాటిని అసలైన పట్టాలు అంటూ ప్రజలకు పంచిపెట్టాడు. దీనిపై ఆరా తీసిన బాపులపాడు తహసీల్దార్‌ సీహెచ్ నరసింహారావు… ఎమ్మెల్యే పంచిన పట్టాలు ఫేక్ అని తేల్చారు.

పాత తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రజలను మోసం చేసినట్టు గుర్తించారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తహసీల్దార్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరులపైనా కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News