విశాఖ భూకుంభకోణంపై కొత్తగా సిట్‌ ఏర్పాటు

టీడీపీ హయాంలో జరిగిన విశాఖ భూకుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల ఎకరాలను కబ్జా చేసేశారు. రికార్డులను మాయం చేసి హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాని కాకమ్మకబుర్లు చెప్పి నాటి ప్రభుత్వ పెద్దలు, జిల్లాకు చెందిన నాటి మంత్రి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి వేల ఎకరాలు కాజేశారు. ప్రజల నుంచి పెద్దెత్తున ప్రతిఘటన రావడంతో చంద్రబాబు అప్పట్లో సిట్‌ ఒకటి ఏర్పాటు చేశారు. సిట్‌ నివేదిక ఇచ్చింది. కానీ.. దాన్ని బాబు బయటపెట్టలేదు. […]

Advertisement
Update: 2019-10-17 20:31 GMT

టీడీపీ హయాంలో జరిగిన విశాఖ భూకుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల ఎకరాలను కబ్జా చేసేశారు. రికార్డులను మాయం చేసి హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాని కాకమ్మకబుర్లు చెప్పి నాటి ప్రభుత్వ పెద్దలు, జిల్లాకు చెందిన నాటి మంత్రి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి వేల ఎకరాలు కాజేశారు.

ప్రజల నుంచి పెద్దెత్తున ప్రతిఘటన రావడంతో చంద్రబాబు అప్పట్లో సిట్‌ ఒకటి ఏర్పాటు చేశారు. సిట్‌ నివేదిక ఇచ్చింది. కానీ.. దాన్ని బాబు బయటపెట్టలేదు. అసలు చర్యలే లేవు. వేల ఎకరాల కుంభకోణాన్ని కొన్ని ఎకరాలకు సంబంధించిన కుంభకోణంగా తగ్గించేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వం తాజాగా విశాఖ కుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి భాస్కరరావును సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. మూడు నెలల్లోగా విశాఖ భూ కుంభకోణంపై ఈ కమిటి నివేదిక సమర్పిస్తుంది.

విశాఖ నగరం, సమీప మండలాల్లో తెలుగు దేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా భూములను ఆక్రమించేశారు. ఒక మాజీ మంత్రి వందల ఎకరాలు కాజేశారు. టీడీపీ అధినేత కుటుంబసభ్యులపైనా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నారా లోకేష్ కనుసన్నల్లోనే జిల్లాకు చెందిన నాటి మంత్రి ఈ వేల ఎకరాల భూకుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నాడు ప్రతిపక్షం నుంచి వచ్చాయి.

కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ ఈ కుంభకోణాన్ని ఎంతవరకు చేధిస్తుంది… ప్రభుత్వం ఎంత వరకు చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News